Telugu Global
Andhra Pradesh

నాకు ఏం జరిగినా రాధాకృష్ణ, 99 టీవీ, ప్రైమ్9 చానళ్లదే బాధ్యత

తనపై 99 టీవీ,ప్రైమ్9,ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సత్యనారాయణ రెడ్డి చెప్పారు. తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసని తానెందుకు రెక్కీకి తన కారు ఇచ్చి పంపుతానని ప్రశ్నించారు.

నాకు ఏం జరిగినా రాధాకృష్ణ, 99 టీవీ, ప్రైమ్9 చానళ్లదే బాధ్యత
X

సాయికృష్ణ చౌదరి, విజయ్ ఆదిత్య అనే ఇద్దరు వ్యక్తులు ఇటీవల పవన్‌ కల్యాణ్ ఇంటి వద్ద సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డారు. దానిపై కేసు నమోదు అవడం, ఆ తర్వాత వారు బెయిల్‌ పై బయటకు రావడం జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత దీన్ని వైసీపీకి,రెడ్డి సామాజికవర్గానికి అంటగట్టేలా ప్రచారం మొదలైంది. పవన్ కల్యాణ్‌ హత్యకు రెక్కీ నిర్వహించారని, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌ కారులో ఆగంతకులు వచ్చారంటూ జనసేన అనుకూల ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరిగింది.

దీనిపై రెడ్డి కార్పొరేషన చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. ఏపీ కమ్మ, ఏపీ కాపు కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి మీడియా ముందుకొచ్చారు. తనపై 99 టీవీ,ప్రైమ్9,ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సత్యనారాయణ రెడ్డి చెప్పారు. తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసని తానెందుకు రెక్కీకి తన కారు ఇచ్చి పంపుతానని ప్రశ్నించారు. తన నేమ్ ప్లేట్‌ను మార్ఫింగ్ చేసి మరో కారుకు అతికించి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రంలో రెడ్లకు, కాపులకు మధ్యచిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని వివరించారు. పవన్ ఇంటి ముందు గొడవపడ్డవారు చంద్రబాబు మనుషులంటూ ఆయనతో వారు దిగిన ఫోటోలను చూపించారు.

ఇలా ప్రజలను రెచ్చగొట్టవద్దని సూచించారు. ఏబీఎన్, 99 చానల్, ప్రైమ్ 9 చేసిన తప్పుడు ప్రచారం కారణంగా తనకు ఎలాంటి హానీ జరిగినా అందుకు ఆ మూడుచానల్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాపు కార్పొరేషన్ చైర్మన్.. అసలు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద గొడవ పడిన ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు మనుషులేనని, అందులోనూ చౌదరీస్ అని ఈ విషయాన్ని కాపులు గమనించాలన్నారు. చంద్రబాబే మనుషులను పంపించి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌కు హాని కలిగించి తద్వారా కాపులకు, వైసీపీకి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

First Published:  4 Nov 2022 12:05 PM GMT
Next Story