Telugu Global
Andhra Pradesh

రాజీనామాలు, సస్పెన్షన్లు, బదిలీలు.. వైసీపీకి లాభమా..? నష్టమా..?

బురదజల్లడంపైనే ఆసక్తి చూపిస్తున్న పచ్చ మీడియా.. టీడీపీ గొప్పలేంటో చెప్పుకోలేక తిప్పలు పడుతోంది. చిన్న చిన్న విషయాల్లో అల్ప సంతోషం టీడీపీకి సొంతమైంది.

రాజీనామాలు, సస్పెన్షన్లు, బదిలీలు.. వైసీపీకి లాభమా..? నష్టమా..?
X

ఏపీలో ఇప్పటి వరకు 44వేలమందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు.

ఇటీవల రాష్ట్రంలో కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.

తాజాగా సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

ఈ వార్తలపై ఎల్లో మీడియా కథనాలు చూస్తుంటే వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అసలు కథ వేరే ఉంది. ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టిన టీడీపీ ప్రచారంలో మాత్రం వెనకపడింది. బురదజల్లేందుకు ఆసక్తి చూపిస్తున్న పచ్చ మీడియా.. టీడీపీ గొప్పలేంటో చెప్పుకోలేక తిప్పలు పడుతోంది. అదే వైసీపీకి బలం అవుతోంది. చిన్న చిన్న విషయాల్లో అల్ప సంతోషం టీడీపీకి సొంతమైంది.

రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఏం చేస్తారు..? మరింత కసిగా వైసీపీ కోసం పనిచేస్తారు. వైసీపీ ప్రచార పర్వంలో వారు అదనపు బలం అవుతారు. ఇక బదిలీ అయిన అధికారుల వల్ల వైసీపీకి నష్టం ఏముంటుంది..? అకారణంగా తమను బదిలీ చేయించారనే బాధ ఆ అధికారుల్లో ఉంటుంది. ఆయా అధికారులతోపాటు వారి సానుభూతి పరుల్ని కూడా టీడీపీ తమకు శత్రువులుగా చేసుకుంటోంది. ఇక సచివాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్ వేటు వేయించిన టీడీపీ కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్టే లెక్క. సచివాలయ ఉద్యోగులకు టీడీపీ వ్యతిరేకం అనే విషయం ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారంతో అది మరోసారి రుజువు అవుతోంది. వాలంటీర్ల నుంచి, సచివాల ఉద్యోగుల వరకు, చివరకు ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా టీడీపీ పూర్తి వ్యతిరేకం అనే విషయం తేటతెల్లమైంది. ఆయా వర్గాలన్నిటినీ తమకు దూరం చేసుకోవడంతోపాటు.. వారికి వైసీపీపై ప్రత్యేకమైన అభిమానం మొదలయ్యేలా చేసింది టీడీపీ. తాను తీసుకున్న గోతిలో తనే పడుతోంది.

First Published:  19 April 2024 4:06 AM GMT
Next Story