Telugu Global
Andhra Pradesh

బ్యాంకుల్లో పెన్షన్లు.. ఎల్లో మీడియా సెల్ఫ్ గోల్

లాజిక్ మిస్ అయిన ఎల్లో మీడియా జగనే కరెక్ట్ అని చెప్పకనే చెబుతోంది. టీడీపీ హయాంలో ఉన్న చెత్త విధానాలను మరోసారి గుర్తు చేసి మరీ చంద్రబాబుని తిట్టిస్తోంది.

బ్యాంకుల్లో పెన్షన్లు.. ఎల్లో మీడియా సెల్ఫ్ గోల్
X

ఇంటి వద్దకే వచ్చే పెన్షన్లు ఆపేసింది టీడీపీ, ఎల్లో మీడియా..

సచివాలయానికి వచ్చి తీసుకుంటుంటే మళ్లీ అడ్డుకుంది.

ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంటే కుదరదంటోంది..

అసలు టీడీపీకి, ఎల్లో మీడియాకు కావాల్సిందేంటి..? ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై ఎందుకింత రచ్చ..?

ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎం జగన్ తనదైన ముద్రవేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా పెన్షన్లు ఇంటి వద్దకే చేర్చేలా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశ పెట్టారు. ఇది టీడీపీకి నచ్చలేదు. ఓ దశలో వాలంటీర్ వ్యవస్థనే తప్పుబట్టారు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు అవసరమా..? ఆ పని చేసినందుకు వారికి రూ.5వేల పారితోషికం అవసరమా అని ప్రశ్నించిన స్థాయి నుంచి వాలంటీర్లకు రూ.10వేలు పారితోషికం ఇస్తాననే స్టేజ్ కి వచ్చారు. అంటే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎంత తప్పో బాబుకి అర్థమైంది. అంటే పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్ తీసుకొచ్చిన విధానానికి సర్వజనామోదం ఉందనే విషయం నిరూపితమైంది.

ఎన్నికల వేళ గొడవ..

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టడంతోపాటు పెన్షన్ల పంపిణీకి కూడా వారిని దూరం చేసి ఇప్పటికే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు చంద్రబాబు. ఆ విషయంలో పెన్షన్ లబ్ధిదారులంతా చంద్రబాబుని తిట్టిపోస్తున్నారు. వాలంటీర్లు లేకపోవడంతో నెలరోజుల క్రితం లబ్ధిదారులంతా సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకున్నారు. అయినా కూడా బాబు కడుపుమంట చల్లారలేదు. జనాల్ని ఇంకా ఏదో ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలనేది ఆయన ఆలోచన. అందుకే ఈసారి మరో మెలిక పెట్టారు. సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవడం కరెక్ట్ కాదని ఈసీకి, అధికారులకు టీడీపీ నేతలతో వినతిపత్రాలు ఇప్పించారు. దీంతో ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయం చూపించింది. డీబీటీ ద్వారా బ్యాంకు అకౌంట్లలో పెన్షన్ జమ చేస్తామంటోంది. ఈ పద్ధతిని కూడా చంద్రబాబు వద్దంటున్నారు. పెన్షన్లపై సర్కారు మరో కుట్ర అంటూ ఎల్లో మీడియా కథనాలిస్తోంది.

సెల్ఫ్ గోల్..

పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయొద్దని, ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని అంటున్నారు చంద్రబాబు, ఎల్లో మీడియా. ఆ డిమాండ్ మంచిదో కాదో పక్కనపెడితే, టీడీపీకి మాత్రం అది సెల్ఫ్ గోల్ లా మారింది. గతంలో చంద్రబాబు హయాంలో నెలలో 15రోజులపాటు పెన్షన్లకోసం లబ్ధిదారులు గ్రామ సచివాలయాల వద్ద పడిగాపులు పడేవారు. ఉదయం వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండేవారు. ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థతో జగన్ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎల్లో మీడియా డిమాండ్ ప్రకారం పెన్షన్ ఇంటికి వెళ్లి ఇవ్వాలన్నమాట. అంటే చంద్రబాబు చేసింది తప్పు, జగన్ చేస్తున్నది ఒప్పు అని ఎల్లో మీడియా ఒప్పుకున్నట్టే లెక్క. జగన్ లాగా పెన్షన్లు ఇంటింటికీ ఇవ్వాలి అని చెప్పడానికి మళ్లీ చంద్రబాబు ఎందుకు..? ఆ పథకానికి ఆద్యుడే జగన్ అయినప్పుడు ఆ డిమాండ్ తో చంద్రబాబు సాధించేది ఏంటి..? ఈ లాజిక్ మిస్ అయిన ఎల్లో మీడియా జగనే కరెక్ట్ అని చెప్పకనే చెబుతోంది. టీడీపీ హయాంలో ఉన్న చెత్త విధానాలను మరోసారి గుర్తు చేసి మరీ చంద్రబాబుని తిట్టిస్తోంది.

First Published:  30 April 2024 4:40 AM GMT
Next Story