Telugu Global
Andhra Pradesh

మార్గదర్శి చిట్‌ కంపెనీలో ఏపీ అధికారుల సోదాలు

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. చిట్స్‌ ద్వారా వసూలు చేసిన డబ్బులను అందుకు సంబంధించిన అవసరాలకు కాకుండా ఇతర వాటికి మళ్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు

మార్గదర్శి చిట్‌ కంపెనీలో ఏపీ అధికారుల సోదాలు
X

ఏపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ఫండ్‌, ఫైనాన్స్ కంపెనీల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ కూడా ఉంది. మార్గదర్శిలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. చిట్స్‌ ద్వారా వసూలు చేసిన డబ్బులను అందుకు సంబంధించిన అవసరాలకు కాకుండా ఇతర వాటికి మళ్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు నిర్దారించారు.

కొన్ని సంస్థలు తమ నిధులను అనుబంధ సంస్థలకు వాడినట్టు గుర్తించారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఏఏ కంపెనీలు ఏఏ అక్రమాలకు పాల్పడ్డాయన్న దానిపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది. మార్గదర్శిలో సోదాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

First Published:  15 Nov 2022 12:36 PM GMT
Next Story