Telugu Global
Andhra Pradesh

జగన్ తో చంద్రబాబును పోల్చడమా? గుడివాడ అమర్నాథ్ ఫైర్

మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేస్తూ..' ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్. జగన్ కు చంద్రబాబుకు మధ్య పోలికేంటి? అని ట్వీట్ చేశారు.

జగన్ తో చంద్రబాబును పోల్చడమా? గుడివాడ అమర్నాథ్ ఫైర్
X

ఏపీలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు పెద్ద రగడే సృష్టిస్తోంది. టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై నందమూరి బాలకృష్ణ స్పందించిన సంగతి తెలిసిందే.

'తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చితే.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మార్చుకున్నాడు.. విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు' అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేస్తూ..' ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్. జగన్ కు చంద్రబాబుకు మధ్య పోలికేంటి? అని ట్వీట్ చేశారు.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల మరో మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. తనదైన శైలిలో ఘాటు కామెంట్స్ చేశారు. 'జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ' అని ట్వీట్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ గా గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు చేసిన ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశం ఏపీలో రాజకీయ కాక పుట్టిస్తోంది.

First Published:  24 Sep 2022 11:22 AM GMT
Next Story