Telugu Global
Andhra Pradesh

ఆంధ్రా పందుల అడ్డా కాదు.. జగన్‌ అడ్డా..

వైసీపీని దించేసి అసెంబ్లీ మీద జనసేన జెండా ఎగరేస్తానని పవన్ చెబుతున్నారని.. ముందు 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారో లేదో చూసుకోవాలన్నారు మంత్రి రోజా.

ఆంధ్రా పందుల అడ్డా కాదు.. జగన్‌ అడ్డా..
X

వైసీపీకి 45 సీట్లు వస్తే మిగిలిన సీట్లు నీ పార్టీకి వస్తాయా అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కల్యాణ్ జాతకాలు చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. ఇదే పవన్‌ గతంలో జగన్ సీఎం కాలేరు.. ఇది నా శాసనం అన్నాడని చివరకు శాసనసభకు కూడా రాలేకపోయాడన్నారు.

వైసీపీని దించేసి అసెంబ్లీ మీద జనసేన జెండా ఎగరేస్తానని పవన్ చెబుతున్నారని.. ముందు 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారో లేదో చూసుకోవాలన్నారు. ముందు పార్టీ తరపున సర్పంచ్‌లను, ఎంపీటీసీలను గెలిపించుకోవాలని ఆ తర్వాత కావాలంటే ఎమ్మెల్యేల గురించి ఆలోచన చేయవచ్చని రోజా సలహా ఇచ్చారు. సినిమా పిచ్చి ఉన్న చిన్నచిన్న పిల్లలు మాత్రమే గ్రామాల్లో పవన్ మీటింగ్‌లకు వస్తున్నారని.. వారిని చూసి సీఎం అయిపోతానని పవన్ కలలు కంటున్నారన్నారు.

పవన్‌ కల్యాణ్‌ తమ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి అని చెప్పుకునేందుకు మిగిలిన నటులంతా సిగ్గుపడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తే మాట్లాడని పవన్‌ కల్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, ప్యాకేజ్ ప్రభావమే అందుకు కారణమన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో దొరికి.. పారిపోయి వచ్చిప్పుడు పవన్ ప్రశ్నించలేదని రోజా నిలదీశారు. అప్పుడు సూట్‌ కేసులు తీసుకునే పనిలో బిజీగా ఉన్నావా అని ప్రశ్నించారు.

బస్సు యాత్ర చేస్తానన్న పవన్, పాదయాత్ర చేస్తానని చెప్పిన లోకేష్ ఇద్దరూ ఒకేసారి ఎందుకు యాత్రలను వాయిదా వేశారని ప్రశ్నించారు. పందులన్నీ గుంపుగా మారి జగన్‌ను ఓడిద్దామంటే అయ్యే పని కాదన్నారు. ఆంధ్రా పందుల అడ్డా కాదని.. జగన్‌ అడ్డా అని రోజా వ్యాఖ్యానించారు.

Next Story