Telugu Global
Andhra Pradesh

పెళ్లీళ్ల‌ వీరుడు పవన్ కళ్యాణ్.. - అంబటి

చంద్రబాబు, లోకేష్‌ల పల్లకీలు మోస్తున్న పవన్ కు పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు అంబ‌టి. అతడు ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని చంద్రబాబుకు అమ్మేశాడన్న అనుమానం ఉందని ఆరోపించారు.

పెళ్లీళ్ల‌ వీరుడు పవన్ కళ్యాణ్.. - అంబటి
X

గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండగా.. ఇందుకు వైసీపీ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. భీమవరం సభలో జ‌గ‌న్‌ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి అసత్య ప్రచారాలు, అసభ్య పదజాలం వాడుతున్నాడని మండిపడ్డారు. అందుకే వారాహి కాస్త‌.. పందిగా మారింద‌ని, దాని మీద‌ ఊరేగుతూ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడ‌ని మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, లోకేష్‌ల పల్లకీలు మోస్తున్న పవన్ కు పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు అంబ‌టి. అతడు ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని చంద్రబాబుకు అమ్మేశాడన్న అనుమానం ఉందని ఆరోపించారు. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని సెటైర్ వేశారు. జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ పదే పదే అంటున్నారని.. మరి ఎవరు రావాలో ఆయ‌నే చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పోతే సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయి కాబట్టి.. జగన్‌ పోవాలన్న వాడే స‌ర్దుకొని పోవాలని అంబటి విమర్శించారు.

పెళ్లీళ్ల‌ విప్లవ వీరుడు పవన్

పవన్ మూడు పెళ్లీళ్ల‌పై అంబటి మరోసారి విమర్శలు చేశారు. పెళ్లీళ్ల‌ విప్లవ వీరుడు పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. నలుగురు విప్లవకారుల పేర్లు తెలిస్తే పవన్ కూడా విప్లవకారుడు అయిపోతాడా..? అని అంబటి ప్రశ్నించారు. వివాహ వ్యవస్థలో మాత్రం పవన్ కళ్యాణ్ విప్లవం తెచ్చాడని, ఆయన పెళ్లీళ్ల‌ వీరుడు అని విమ‌ర్శించారు. వివాహ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ కు నమ్మకం లేదని, అసలు ఆయనలోనే ఏదో తేడా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లీళ్ల‌పై అంబటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  1 July 2023 12:07 PM GMT
Next Story