Telugu Global
Andhra Pradesh

ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కీల‌క నిర్ణ‌యం

త‌న‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం సీనియారిటీనా..? అని స్పీక‌ర్ త‌మ్మినేని ప్ర‌శ్నించారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలంటే అంత చిన్న‌చూపా అంటూ నిల‌దీశారు.

ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కీల‌క నిర్ణ‌యం
X

ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై స‌భ్యులు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వ‌స్తే ఆటోమేటిక్ స‌స్పెన్ష‌న్ అమ‌లు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ స‌భ్యులు త‌న ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని మండిప‌డ్డారు. వారి తీరుపై స్పీక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లైన్ దాట‌కుండా నిర‌స‌న తెలిపే హ‌క్కు స‌భ్యుల‌కు ఉంద‌ని, కానీ ఇక‌పై పోడియం వ‌ద్ద‌కు వ‌స్తే మాత్రం ఆటోమేటిక్ స‌స్పెన్ష‌న్ అమ‌ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ సీనియ‌ర్ స‌భ్యులే త‌నపై దాడులు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని స్పీక‌ర్ చెప్పారు.

బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలంటే అంత చిన్న‌చూపా?

త‌న‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం సీనియారిటీనా..? అని స్పీక‌ర్ త‌మ్మినేని ప్ర‌శ్నించారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలంటే అంత చిన్న‌చూపా అంటూ నిల‌దీశారు. త‌న చైర్ వ‌ద్ద‌కు వ‌చ్చే హ‌క్కు స‌భ్యుల‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. స‌భ్యులంతా త‌న‌కు స‌మాన‌మేన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

స్పీక‌ర్ చైర్‌ను ట‌చ్ చేసి.. త‌న ముఖంపై ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ని.. ఎమ్మెల్యే ఎలీజాను నెట్టివేశార‌ని స్పీక‌ర్ తెలిపారు. స‌భ‌లో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు చూస్తార‌ని, ఇప్ప‌టికైనా టీడీపీ స‌భ్యుల తీరు మార్చుకోవాల‌ని సూచించారు.

First Published:  20 March 2023 9:41 AM GMT
Next Story