Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి !

ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపాల్సి ఉంది.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి !
X

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మిశ్రాను నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు సిఫార్సు కాపీని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య ఒక విధమైన ఘర్షణపూరిత వాతావరణం నడుస్తున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా వచ్చారు. ఆయన వచ్చాకే ఘర్షణ వాతావరణం తగ్గిపోయింది. అప్పటి వరకు వరుసగా ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే హైకోర్టు నుంచి వస్తున్నాయన్న విమర్శలకు ఆయన చెక్ పెట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను అర్థం చేసుకుని తీర్పులు ఇస్తూ వచ్చారు. అదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను నిలువరించడంలోనూ వెనుకాడలేదు.

జస్టిస్ మిశ్రా 2021 అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు.

First Published:  16 May 2023 12:35 PM GMT
Next Story