Telugu Global
Andhra Pradesh

ఎడెక్స్ ఆన్‌లైన్ లెర్నింగ్‌.. ఏపీ విద్యార్థుల‌కు వ‌ర‌ల్డ్ క్లాస్ పాఠాలు

విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఎడెక్స్ ప్రోగ్రాం ఓ సువ‌ర్ణావ‌కాశం.

ఎడెక్స్ ఆన్‌లైన్ లెర్నింగ్‌.. ఏపీ విద్యార్థుల‌కు వ‌ర‌ల్డ్ క్లాస్ పాఠాలు
X

రాష్ట్రంలో విద్యారంగం రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోజూ ఓ వినూత్న కార్య‌క్ర‌మంతో ముందుకెళుతోంది. పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్టింది. అంత‌ర్జాతీయ స్థాయిలో పేరెన్నిక‌గ‌న్న ఐబీ సిల‌బ‌స్‌తో విద్యారంగాన్ని మ‌రో అడుగు ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఉన్న‌త విద్య చ‌దువుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.

12 లక్షల మంది విద్యార్థుల‌కు వ‌రం

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న‌త విద్య చ‌దువుతున్న విద్యార్థులు 12 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇక‌పై వీరు ప్రపంచ‌స్థాయి యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులను, రెగ్యులర్‌ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. ఆయా సంస్థ‌ల్లోని ఉత్త‌మ అధ్యాపకుల బోధన ఏపీ విద్యార్థుల జీవితాన్ని మేలిమలుపు తిప్ప‌నుంది. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సి­టీ­ల నుంచి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు.

హార్వ‌ర్డ్‌, ఎంఐటీ లాంటి అత్యుత్త‌మ విద్యాసంస్థ‌లు

ఇప్పటికే ఎడె­క్స్, ఉన్నత విద్యాశాఖ క‌లిసి టీచింగ్, లె­ర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు.

విదేశాల‌కు వెళ్ల‌లేని విద్యార్థుల‌కు గోల్డెన్ చాన్స్‌

విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఎడెక్స్ ప్రోగ్రాం ఓ సువ‌ర్ణావ‌కాశం. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్‌ కోర్సు­లకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్‌ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఇవి అద‌న‌పు అర్హ‌త‌లుగా మారి మంచి ఉద్యోగాలు సాధించేందుకు అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయి.

First Published:  16 Feb 2024 5:14 AM GMT
Next Story