Telugu Global
Andhra Pradesh

పరిశ్రమలకు జెట్ స్పీడులో అనుమతులు

వైఎస్సార్ ఏపీ 1 అనే విధానం ద్వారా నూతన ఇండస్ట్రియల్ పాలసీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దీన్ని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోంది. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లాలోను ఒక సబ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

పరిశ్రమలకు జెట్ స్పీడులో అనుమతులు
X

రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న పరిశ్రమలకు అవసరమైన అనుమతులను ఇకనుండి జెట్ స్పీడులో ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం ప్రత్యేకంగా వైఎస్సార్ ఏపీ 1 అనే యాప్‌ను కొత్తగా రూపొందించింది. దీన్ని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఏర్పాటుచేయబోతోంది. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లాలోను ఒక సబ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ ఏపీ 1 అనే విధానం ద్వారా నూతన ఇండస్ట్రియల్ పాలసీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.

కొత్త ప‌ద్ధ‌తిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని 21 రోజుల్లోనే కేటాయించాలని డిసైడ్ అయ్యింది. అలాగే మౌలిక సదపాయాలైన విద్యుత్‌, నీరు, రోడ్లు, ఇత‌ర‌ సౌకర్యాలను కూడా జెట్ స్పీడులో అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. సింపుల్‌గా చెప్పాలంటే లోకాస్ట్-లోరిస్క్ బిజినెస్‌కు పెద్దపీట వేయబోతోంది. ఎక్కడైనా పరిశ్రమల ఏర్పాటుకావాలంటే భూ కేటాయింపులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే పద్ద సమస్య.

అందుకనే ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే లో కాస్ట్..లో రిస్క్ బిజినెస్ అనే పద్ధ‌తిని అమలుచేయబోతోంది. ఈమధ్యనే జరిగిన పెట్టుబడుల సదస్సులో రూ.13.5 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కనీసం సగం ఎవోయూలను అయినా వాస్తవరూపంలోకి తీసుకురావటమే ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఫాలో అప్ కమిటినీ కూడా వేసింది. దాని ఫలితంగానే క్యాడ్ బరీస్ సంస్థ‌ ఏపీలో రూ.1600తో కొత్తగా యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

14 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఫార్మా, టూరిజం, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పవర్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెట్టుబడులను కూడా ఒకేచోట కూడా వివిధ జిల్లాల్లో పెట్టేలా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతోంది. వచ్చే ఎన్నికల్లోగా కొన్నింటినైనా వాస్తవ రూపంలోకి తీసుకురావాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకనే కొత్త పారిశ్రామిక విధానాన్నిప్ర‌భుత్వం రూపొందించింది. మరి ఫలితాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.

First Published:  28 March 2023 6:12 AM GMT
Next Story