Telugu Global
Andhra Pradesh

సూర్యనారాయణ సంఘంపై వేటు ఖాయమేనా?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సూర్యనారాయణ ఉన్నారు. ఈయనే గవర్నర్‌ను కలిశారు. నిజానికి సూర్యనారాయణ సంఘానికి గుర్తింపు ఇవ్వకూడదని మిగిలిన సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి.

సూర్యనారాయణ సంఘంపై వేటు ఖాయమేనా?
X

ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వడం లేదు.. ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చట్టం కావాలంటూ గవర్నర్‌ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నేరుగా గవర్నర్‌ను కలవడం రోసా నిబంధనలకు విరుద్ధ‌మని ప్రభుత్వం నోటీసుల్లో స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ నేరుగా గవర్నర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇలా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినందుకు గాను.. సంఘం గుర్తింపును రద్దు చేసేందుకు ఉన్న నిబంధనలను నోటీసుల్లో ప్రస్తావించారు. గవర్నర్‌ను కలవడమే కాకుండా ఆ విషయాన్ని మీడియాకు తెలియజేయడంపైన ప్రభుత్వం నోటీసుల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సూర్యనారాయణ ఉన్నారు. ఈయనే గవర్నర్‌ను కలిశారు. నిజానికి సూర్యనారాయణ సంఘానికి గుర్తింపు ఇవ్వకూడదని మిగిలిన సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. కానీ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఘానికి గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఘమే వైసీపీ ప్రభుత్వ పరువు తీసేందుకు గవర్నర్‌ను కలవడంతో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.

Next Story