Telugu Global
Andhra Pradesh

పాలమూరు-రంగారెడ్డిపై సుప్రీంకోర్టుకి ఏపీ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వల్ల కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటా నష్టపోతామని అంటోంది ప్రభుత్వం. అందుకే 90టీఎంసీల జీవోని రద్దు చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. అక్కడ కుదరకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తోంది.

పాలమూరు-రంగారెడ్డిపై సుప్రీంకోర్టుకి ఏపీ
X

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కృష్ణానది నుంచి 90టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లలో ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు, పిటిషన్లు వేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అప్లికేషన్ ను కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్(KWDT) తిరస్కరించడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడింది.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణ­యించింది. దీనికి ముందు KWDTలో ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను వేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆ జీవోపై విచారణ చేపట్టడం తమ పరిధిలోకి రాదంటూ KWDT.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌(ఐఏ)ను తిరస్కరించింది. దీంతో తెలంగాణలో సంబరాలు జరిగాయి. తమకు న్యాయం జరిగిందని, కృష్ణాలో తమకు రావాల్సిన న్యాయపరమైన వాటాను ట్రిబ్యునల్ కూడా వ్యతిరేకించలేదని అన్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించాలనుకోవడం కీలక మలుపు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వల్ల కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటా నష్టపోతామని అంటోంది ప్రభుత్వం. అందుకే 90టీఎంసీల జీవోని రద్దు చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. అక్కడ కుదరకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తోంది. ఆ జీవోను రద్దు చేయడం ద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవించబోతోంది.

First Published:  22 Sep 2023 1:38 AM GMT
Next Story