Telugu Global
Andhra Pradesh

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లైన్ క్లియర్..!

Waltair Veerayya pre release event: ఇందుకు ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఎంచుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను ఎంపిక చేశారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లైన్ క్లియర్..!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఈ చిత్ర నిర్మాతలు ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన పలు విశేషాలను వెల్లడించారు. ఇక ఈనెల 8వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీస్థాయిలో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు.

హైదరాబాద్ నుంచి ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక రైలును కూడా బుక్ చేశారు. అయితే ఆర్కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేస్తున్న ఏర్పాట్ల‌ను నిన్న పోలీసులు అడ్డుకున్నారు. బీచ్ లో ఈవెంట్ నిర్వహించడానికి పోలీసులు అనుమతించలేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం రోడ్లలో, ప్రధాన కూడళ్ళల్లో సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో నెంబర్.1ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు.

ఇందుకు ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఎంచుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను ఎంపిక చేశారు. ఇక్కడ ఈవెంట్ నిర్వహణకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ ఈవెంట్ కు చిరంజీవితోపాటు, రవితేజ కూడా హాజరు కాబోతుండటంతో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టగా పోలీసులు ముందు అనుమతించలేదు. ఆ తర్వాత పోలీసుల సూచనల మేరకు పట్టణంలోని ఇన్ ఫ్రా గ్రౌండ్స్ కు వేదికను మార్చగా అనుమతి లభించింది.

Next Story