Telugu Global
Andhra Pradesh

సాయంలోనూ పోటీయేనా?

దీనికి కారణం ఏమిటంటే మత్స్యాకారుల ఓట్లు మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మత్స్యాకారుల ఓట్లు లక్షల్లో ఉన్నాయి.

సాయంలోనూ పోటీయేనా?
X

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, పార్టీలు వెంటనే స్పందిస్తున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లో నాలుగు రోజుల క్రితం 40 ఫిషింగ్ బోట్లు పూర్తిగా, మరో 40 బోట్లు పాక్షికంగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులను పరామర్శించబోతున్నారు. ఘటన వెలుగు చూడగానే బాధితులకు పవన్ తలా రూ. 50 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ ప్రకటనను ఇప్పుడు సాకారం చేయటంలో భాగంగానే మత్స్యకార కుటుంబాలను నేరుగా కలవబోతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రభుత్వం కూడా రూ.7.11 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మంత్రులు బాధితులను కలిసి చెక్కులను పంపిణీ చేశారు. పవన్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేయబోతుంటే ప్రభుత్వం గురువారమే చెక్కులను అందించింది. ప్రభుత్వం స్పందించినా, పవన్ స్పందించినా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పవన్ సాయాన్ని ప్రకటించి చెక్కులు అందిస్తున్నారంటే అది పార్టీ డబ్బు కాబట్టి వీలైనంత తొందరగానే అందిస్తున్నారని అనుకోవాలి. మరి ప్రభుత్వం అంతకన్నా స్పీడుగా చెక్కులను ఎలా పంపిణీ చేయగలిగింది ? ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి తలచుకున్నారు కాబట్టే చెక్కుల పంపిణీ అయిపోయింది. దీనికి కారణం ఏమిటంటే మత్స్యాకారుల ఓట్లు మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మత్స్యాకారుల ఓట్లు లక్షల్లో ఉన్నాయి.

పై జిల్లాల్లోని 68 నియోజకవర్గాల్లో చాలా స్థానాల్లో వీళ్ళ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తాయనటంలో సందేహంలేదు. పైగా వీరంతా బీసీ సామాజికవర్గంలోకి వస్తారు. అందుకనే ఆర్థికసాయం అందించే విషయంలో ప్రభుత్వం, జనసేన ఇంత స్పీడుగా స్పందించాయి. బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం లేదా పార్టీలు ఎప్పడూ ఇంతే స్పీడుగా స్పందిస్తే ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? మొత్తానికి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం, జనసేన ఇంత స్పీడుగా స్పందించినా బాధితులకు మాత్రం తక్షణ ఊరట దక్కటం కొంతలో కొంత సంతోషించాల్సిన విషయం అనటంలో సందేహంలేదు.


First Published:  24 Nov 2023 5:49 AM GMT
Next Story