Telugu Global
Andhra Pradesh

హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్‌ స్థానంలో వైఎస్‌ఆర్‌ పేరు

జగన్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ఆర్ పేరును చేర్చబోతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారు.. దీని వెనుక కారణాలేంటి అన్నది అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది.

హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్‌ స్థానంలో వైఎస్‌ఆర్‌ పేరు
X

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పున‌కు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్శిటీ పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి రజనీ ఈ బిల్లును ప్రవేశపెడతారు.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 1986లో ఏపీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుతో హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1998లో వర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చారు. 2006లో వైఎస్‌ఆర్ ప్రభుత్వం .. ఎన్టీఆర్ పేరు ముందు డాక్టర్‌ చేర్చుతూ డాక్టర్ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్పు చేసింది.

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ఆర్ పేరును చేర్చబోతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారు.. దీని వెనుక కారణాలేంటి అన్నది అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. టీడీపీ దీనిపై గొడవ చేసేందుకు సిద్ధమవుతోంది. పలువురు ముఖ్యమంత్రులు మారినా 24ఏళ్లుగా ఎన్టీఆర్‌ పేరు జోలికి వెళ్లలేదని ఇప్పుడు ఆ పని జగన్ చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

పేరు మార్పున‌కు అవసరమైన చట్ట సవరణ ప్రతిపాదనలను ఆరోగ్య శాఖ సిద్ధం చేసి ఆన్‌లైన్‌లోనే మంత్రులకు పంపించి ఆమోదం తీసుకుంది.

First Published:  21 Sep 2022 2:33 AM GMT
Next Story