Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రబాబుకు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించినందుకే ఆయనను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పెండ్యాల శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును సీఐడీ విచారిస్తున్న సమయంలో శ్రీనివాస్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఐటీ శాఖ కూడా శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది. పెండ్యాల శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరినట్లు సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నది.

ఈ క్రమంలో సీఐడీ అరెస్టు చేస్తుందేమో అనే భయంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఇప్పటికే ఏపీకి తిరిగి రావాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారం లోగా కార్యాలయంలో రిపోర్టు చేయాలని నోటీసులు జారీ చేసినా.. శ్రీనివాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో శనివారం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్రధారులుగా శ్రీనివాస్‌తో పాటు డిజైన్‌ టెక్‌కు చెందిన మనోజ్ కూడా ఉన్నట్లు సీఐడీ తెలిపింది. శ్రీనివాస్‌తో పాటు మనోజ్ కూడా అమెరికా పారిపోయినట్లు గుర్తించింది. ప్రస్తుతం వీరిద్దరినీ తిరిగి ఇండియాకు తీసుకొని రావడానికి ఇంటర్‌పోల్ సహాయం తీసుకోనున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.


First Published:  30 Sep 2023 6:18 AM GMT
Next Story