Telugu Global
Andhra Pradesh

ఆరు నెల‌ల్లో అర‌ల‌క్ష కోట్ల అప్పు

ఒక్క బహిరంగ మార్కెట్‌లోనే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 39వేల 890 కోట్ల రుణాన్ని సేకరించింది. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి 8,300 కోట్లు, కేంద్ర రుణాల ద్వారా 1400, నాబార్డు నుంచి 40కోట్లు అప్పు తీసుకుంది.

ఆరు నెల‌ల్లో అర‌ల‌క్ష కోట్ల అప్పు
X

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మరింత ఎక్కువగా అప్పులపై ఆధారపడుతోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 50వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. ప్రతివారం క్రమం తప్పకుండా ఆర్బీఐ వద్ద బాండ్లను విక్రయించి వెయ్యి, రెండు వేల కోట్ల అప్పు తెస్తోంది. ఈ మంగళవారం కూడా రెండువేలకోట్ల రూపాయలను సెక్యూరిటీల వేలంలో అప్పు తీసుకుంది ఏపీ.

ఒక్క బహిరంగ మార్కెట్‌లోనే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 39వేల 890 కోట్ల రుణాన్ని సేకరించింది. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి 8,300 కోట్లు, కేంద్ర రుణాల ద్వారా 1400, నాబార్డు నుంచి 40కోట్లు అప్పు తీసుకుంది. ఈ మొత్తం కలిపితే 49వేల 603 కోట్లగా అప్పు ఉంది. అంటే ఆరునెలల కాలంతో దాదాపుగా అర లక్ష కోటికి దగ్గరగా ఏపీ అప్పులు తీసుకొచ్చింది.

అత్యధికంగా మే నెలలో రూ.9,890 కోట్లు, జూన్‌లో 8వేల కోట్లు, జూలైలో మరో 8వేల కోట్లు, ఆగస్టులో 7వేల కోట్లు, సెప్టెంబర్‌లో 3వేల కోట్ల రూపాయలను రాష్ట్రం అప్పు తెచ్చింది. అక్టోబర్ ఆరంభ నెలలో రెండువేల కోట్ల రూపాయల రుణం సెక్యూరిటీ విక్రయం ద్వారా సాధించింది. కేంద్రం నిర్దేశించిన‌ వార్షిక అప్పు పరిమితిని త్వరలోనే ఏపీ దాటేయనుంది.

First Published:  4 Oct 2022 3:48 AM GMT
Next Story