Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్ పురస్కారాలు-2022.. అవార్డులు అందుకోబోయేది వీళ్లే

వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ వంటి రంగాలకు చెందిన 25 వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

వైఎస్ఆర్ పురస్కారాలు-2022.. అవార్డులు అందుకోబోయేది వీళ్లే
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జీవిత సాఫల్యం, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు - 2022 లిస్టును ప్రకటించారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోస్క్రీనింగ్ కమిటీ సభ్యులు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ వంటి రంగాలకు చెందిన 25 వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

అవార్డులు పొందివారు వీళ్లే..

కళలు/సంస్కృతి విభాగం:

కళాతపస్వి కే. విశ్వనాథ్ (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

ఆర్. నారాయణ మూర్తి (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

రంగస్థల కళాకారుడు నాయుడు గోపి (వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం)

కళంకారీ కళాకారుడు పిచుక శ్రీనివాస్ (వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం)

షేక్ గౌసియా బేగం (వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం)

సాహిత్య సేవ

విశాంలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

ఎమ్మెస్కో పబ్లిషర్స్ (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

రచయిత డాక్టర్ శాంతి నారాయణ (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

వ్యవసాయం

ఆదివాసీ కేష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ - సోడెం ముక్కయ్య (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

కుశలవ కోకోనట్ ప్రొడ్యూసర్స్ కంపెనీ - ఏ. గోపాలకృష్ణ (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

అన్నమయ్య మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ - జయబ్బ నాయుడు (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ - కేఎల్ఎన్ మౌక్తిక (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

కట్టమంచి బాలకృష్ణారెడ్డి (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

మహిళా సాధికారత/రక్షణ విభాగం

ప్రజ్వలా ఫౌండేషన్ - సునీతా కృష్ణన్ (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

శిరీషా రీహాబిలిటేషన్ సెంటర్ - (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

దిశ పోలీసింగ్ - (వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం)

దిశ పోలీసులు రవాడ జయంతి, ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య, పి. శ్రీనివాసులు వీరందరికీ వైఎస్ఆర్ సాఫల్య అవార్డు ఉమ్మడిగా ప్రకటించారు.

First Published:  14 Oct 2022 1:51 PM GMT
Next Story