Telugu Global
Andhra Pradesh

సీఎం జ‌గ‌న్ చెబితే చాలు.. అలీ సిద్ధం

అలీని రాష్ట్రంలోని ముస్లిం జ‌నాభా గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో ఉన్న ఏదైనా మైనారిటీ ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయిస్తార‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉంది.

సీఎం జ‌గ‌న్ చెబితే చాలు.. అలీ సిద్ధం
X

న‌టుడు, ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అలీ మ‌న‌సులో మాట చెప్పేశారు. రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్నాన‌ని స్ప‌ష్టంచేశారు. సీఎం జ‌గ‌న్ పిలిచి ఫ‌లానా చోట నుంచి పోటీ చెయ్ అంటే చాలు ఎక్క‌డి నుంచి అయినా పోటీ చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

సీఎంవో నుంచి పిలుపు రావ‌చ్చు

గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీ చేయ‌మ‌ని న‌న్ను అడిగారు. అప్ప‌టికి రాజ‌కీయాల‌పై అంత అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, క‌మిట్‌మెంట్ ఇచ్చిన సినిమాలు కూడా ఉండ‌టంతో పోటీకి దూరంగా ఉన్నానని అలీ చెప్పారు. ఈసారి పోటీకి సిద్ధంగా ఉన్నాన‌న్నారు. సీఎంవో నుంచి ఇంకా పిలుపు రాలేద‌ని, ఈ వార‌మే రావ‌చ్చ‌ని ఆయ‌న విశ్వాసం ప్ర‌క‌టించారు.

ఎక్క‌డి నుంచి అవ‌కాశం..?

అలీని రాష్ట్రంలోని ముస్లిం జ‌నాభా గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో ఉన్న ఏదైనా మైనారిటీ ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయిస్తార‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉంది. ప్ర‌ధానంగా గుంటూరు వెస్ట్ లేదా విజ‌య‌వాడ వెస్ట్‌లో నిల‌బెట్ట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. లేదంటే అలీ స్వ‌స్థ‌ల‌మైన రాజ‌మండ్రి, ఆ ప‌రిస‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయిస్తారా అనేదీ చ‌ర్చ‌లో ఉంది. అస‌లు జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో మ‌రి!

First Published:  19 Feb 2024 12:14 PM GMT
Next Story