Telugu Global
Andhra Pradesh

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబూరు

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఫిజికల్ టెస్ట్‌లు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూటమి సర్కార్ శుభవార్తను అందించింది.

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబూరు
X

ఏపీ కూటమి సర్కార్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. ఏడాదిన్నర క్రితం ఆగిపోయిన కానిస్టేబుళ్ల నియామక పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఐదు నెలల్లో ఫిజికల్ టెస్ట్‌లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో లభ్యమవుతాయన్నారు. ఐదు నెలల్లో పీఎంటి, పీఈటి పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు.

రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని ఆమె ప్రకటించారు.ఏపీలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్ 28 నోటిఫికేషన్ రిలీజ్‌యిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. వీరిలో తదుపరి దశకు 95,209 అభ్యర్థులు ఎంపికయ్యారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా శారీరక సామర్థ్య పరీక్షలు కోసం సన్నద్ధమవుతున్నారు.

First Published:  1 Oct 2024 2:00 PM GMT
Next Story