Telugu Global
Andhra Pradesh

అప్పుడు రాఘవేంద్రరావు, ఇప్పుడు అలీ..

గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా ఉన్నారని, ఇప్పుడు ఆ పదవి తనకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు అలీ.

అప్పుడు రాఘవేంద్రరావు, ఇప్పుడు అలీ..
X

ఏపీ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తనకు పదవి ఇచ్చినందుకు సీఎం జగన్ ని కలసి కృతజ్ఞతలు తెలిపారు సినీ నటుడు అలీ. సతీ సమేతంగా సీఎంను కలసిన ఆయన తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తొలి ఆహ్వాన పత్రిక సీఎం జగన్ కి అందించానని చెప్పారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అలీ, ఆయన ఆజ్ఞ ప్రకారం తాను బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.

బూతులు అవసరమా..?

రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని, అది కోల్పోయి మాట్లాడితే జనమే రాజకీయ నేతలపై తిరగబడతారని అన్నారు అలీ. సహనం ఉన్న వారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. సీఎం జగన్‌, అలా సహనంతో ఉండి ప్రజాసమస్యలపై తిరుగులేని పోరాటాలు చేస్తూ, సీఎం పదవిని అధిరోహించారని చెప్పారు. పదవుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారు సీఎం జగన్‌ లా ఉండాలని చెప్పారు అలీ. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవడం సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం ముందు నేతలు గ్రహించాలని సూచించారు.

అప్పుడు ఆయన, ఇప్పుడు నేను..

గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా ఉన్నారని, ఇప్పుడు ఆ పదవి తనకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు అలీ. గతంలో అలీ పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇకముందు సీఎం జగన్‌ ఆదేశాలను శిరసావహించి ముందుకు వెళ్తానన్నారు. తన వల్ల సీఎం జగన్‌ కు మరింత మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానన్నారు అలీ. ఈసారి 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఆ విజయంలో తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారని అన్నారాయన.

First Published:  3 Nov 2022 2:25 AM GMT
Next Story