Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ‘ఎన్టీఆర్ హంతక' బిరుదు ఇవ్వాలి.. - డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

చంద్రబాబుకు ‘ఎన్టీఆర్ హంతక బిరుదు ఇవ్వాలి.. - డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
X

ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు `ఎన్టీఆర్ హంత‌క‌` బిరుదు ఇవ్వాల‌ని అంటున్నారు డిప్యూటీ సీఎం, దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌మండ్రిలో మ‌హానాడు కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ నేత‌లు.. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌కు `భార‌త ర‌త్న` ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాల‌నుకుంటున్న విష‌యం తెలిసిందే.

దీనిపైనే ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శ‌లు గుప్పించారు. కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తూ.. 'భారతరత్న' ఇవ్వాలని దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిప‌డ్డారు. ఇది చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు.

ఎన్టీఆర్ పేరునే నిర్మూలించాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్‌కు 'భారతరత్న' ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారా.. అని కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ ప్రశ్నించారు.

First Published:  22 May 2023 4:16 PM GMT
Next Story