Telugu Global
Andhra Pradesh

పీక్స్‌కు చేరిన షర్మిల ఏడ్పు

బీజేపీతో చంద్రబాబు పొత్తు షర్మిలకు తెలీదా..? బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబును మొహమాటానికి నాలుగు మాటలంటున్న షర్మిల.. జగన్ మీద మాత్రం నోటికొచ్చినట్లు రెచ్చిపోతున్నారు.

పీక్స్‌కు చేరిన షర్మిల ఏడ్పు
X

కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల ఏడుపు పీక్స్‌కు చేరుకున్నట్లుంది. వైసీపీ ఆధ్వ‌ర్యంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలు సూపర్ సక్సెస్ కావాటాన్న షర్మిల తట్టుకోలేకపోతోంది. ఎల్లో మీడియాతో పాటు తాను కూడా ఏడుపులు మొదలుపెట్టేశారు. సభలకు అయిన ఖర్చులు రూ. 600 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయమై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి జగన్ రహస్య మిత్రుడు, వారసుడంటూ పనికిమాలిన ఆరోపణలు చేశారు. హోదా కోసం జగన్ ఎందుకు డిమాండ్ చేయలేదని జగన్మోహన్ రెడ్డిని షర్మిల నిలదీయటమే విచిత్రంగా ఉంది.

సిద్ధం బహిరంగ సభలకు డబ్బులు ఎక్కడినుంచి వస్తాయని నిలదీసేముందు కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలకు, తాను చేస్తున్న పర్యటనలకు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో షర్మిల చెప్పగలరా..? ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖర్చులన్నింటినీ తెలంగాణ కాంగ్రెస్సే భరిస్తోందన్న ప్రచారానికి షర్మిల ముందు సమాధానం చెప్పాలి. వైజాగ్ పార్టీ ఆఫీసుకు అద్దె కట్టలేక తాళాలు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇన్ని నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయి..? ఇక బీజేపీకి రహస్యమిత్రుడు, వారసుడంటూ ఆరోపించటం ఆశ్చర్యంగా ఉంది. బీజేపీకి జగన్ రహస్య మిత్రుడన్న విషయం పక్కనపెట్టేస్తే చంద్రబాబునాయుడు డైరెక్టుగా పొత్తు పెట్టుకున్నారు.

బీజేపీతో చంద్రబాబు పొత్తు షర్మిలకు తెలీదా..? బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబును మొహమాటానికి నాలుగు మాటలంటున్న షర్మిల.. జగన్ మీద మాత్రం నోటికొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబుపై షర్మిల అన్న మాటలను ఎల్లోమీడియా సెన్సార్ చేసేసి జగన్ పై ఆరోపణలను మాత్రమే అచ్చేసింది. అంటే ముందుముందు జగన్ పైన కాకుండా అచ్చంగా చంద్రబాబు మీదే షర్మిల ఆరోపణలు చేస్తే ఆ వార్తలు ఎల్లో మీడియాలో కనబడవని అర్థ‌మైపోయింది. చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందని ఎల్లో మీడియా భావిస్తే షర్మిలకు ప్రచారం ఉండ‌దన్నది ఖాయం.

ప్రచారం లేకపోతే షర్మిల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు లెక్కే. మొదటినుంచి జగన్ పైన షర్మిల ఆరోపణలు, విమర్శలు, ఏడ్పులు జనాలందరికీ అర్థ‌మైపోతున్నాయి. ఎవరు చెబితే, ఎవరికోసం షర్మిల ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులు కారు జనాలు. కాబట్టి జనాల్లో తనంతట తానుగానే పలుచనైపోతున్న విషయాన్ని షర్మిల గ్రహించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  11 March 2024 5:27 AM GMT
Next Story