Telugu Global
Andhra Pradesh

ఆడుదాం ఆంధ్రా.. వైరల్ అవుతున్న జగన్ వీడియో

సహజంగా ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టినా, ఆల్రడీ ఉన్న కార్యక్రమంలోనే సీఎం జగన్ పాల్గొన్నా ఆయన ప్రసంగంపై అందరికీ ఆసక్తి ఉంటుంది.

ఆడుదాం ఆంధ్రా.. వైరల్ అవుతున్న జగన్ వీడియో
X

సహజంగా ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టినా, ఆల్రడీ ఉన్న కార్యక్రమంలోనే సీఎం జగన్ పాల్గొన్నా ఆయన ప్రసంగంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే ఆయన ఆడియో వైరల్ అవుతుంది. కానీ ఏపీలో కొత్తగా మొదలు పెట్టిన 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమంలో మాత్రం జగన్ వీడియో వైరల్ గా మారింది. ఆడుదాం ఆంధ్రా ప్రారంభోత్సవంలో సీఎం జగన్ తోపాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రి రోజాకు క్రికెట్ నేర్పిస్తున్నట్టుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


క్రీడా పోటీల ప్రారంభోత్సవంకోసం ఈరోజు గుంటూరు నల్లపాడు లయోలా కాలేజీ గ్రౌండ్ కి వెళ్లారు సీఎం జగన్. ఆయన వెంట మంత్రులు, అధికారులు ఉన్నారు. ముందుగా క్రికెట్ పిచ్ దగ్గరకు వెళ్లారు సీఎం జగన్. బ్యాట్ తీసుకుని మంత్రి రోజాకి అందించి దీవించారు. ఆమె తటపటాయిస్తూనే బ్యాట్ పట్టుకుని వికెట్ల ముందు నిలబడ్డారు. వెంటనే జగన్ ఆమె వద్దకు వచ్చి బ్యాట్ ఎలా పట్టుకోవాలో చెప్పారు. రోజా చేతికి బ్యాట్ ఇచ్చి, ఆమె సరిగ్గా పట్టుకునేలా చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ స్వయంగా బ్యాటింగ్ చేశారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు.


మంత్రి రోజాకి సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైసీపీ అకౌంట్లతోపాటు.. టీడీపీ సానుభూతిపరులు కూడా ఈ వీడియోని వైరల్ చేశారు. ఎవరెవరు ఏ ఉద్దేశంతో ఈ వీడియో వైరల్ చేసినా.. జగన్ బ్యాటింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. జగన్ ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడిలాగా ఆడారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

First Published:  26 Dec 2023 9:55 AM GMT
Next Story