Telugu Global
Andhra Pradesh

కుటుంబాలను చీలుస్తారు.. పొత్తులు పెట్టుకుంటారు

కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అక్కడే నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.

కుటుంబాలను చీలుస్తారు.. పొత్తులు పెట్టుకుంటారు
X

ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇస్తున్న వేళ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. "రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. అన్నీ జరుగుతాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలని మీ అందర్నీ కోరుతున్నా" కాకినడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి.

కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అక్కడే నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. మాజీసీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేశారు. "చంద్రబాబు హయాంలో పెన్షన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తేతప్ప పని జరిగేది కాదు. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారు. చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని, ఒక్క సెంటు కూడా ఇ‍వ్వలేదు.

పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లెటర్‌ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్‌ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

First Published:  3 Jan 2024 9:09 AM GMT
Next Story