Telugu Global
Andhra Pradesh

జగన్‌ అనే నేను.. హామీ ఇస్తున్నాను

వైసీపీ గెలుపుపై తన ట్వీట్‌లో మరోసారి ధీమా వ్యక్తం చేసిన జగన్‌.. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

జగన్‌ అనే నేను.. హామీ ఇస్తున్నాను
X

ఏపీలో ముగిసిన పోలింగ్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అర్ధరాత్రి వరకు బారులు తీరి మరీ ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు జగన్‌. ఈ మేరకు జగన్‌ ట్వీట్ చేశారు.

తనను ఆశీర్వదించేందుకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా వచ్చిన అవ్వ తాతలకు, అక్కాచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు జగన్. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇక వైసీపీ గెలుపుపై తన ట్వీట్‌లో మరోసారి ధీమా వ్యక్తం చేసిన జగన్‌.. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన సుపరిపాలన.. భవిష్యత్తులో మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు.

First Published:  14 May 2024 12:09 PM GMT
Next Story