Telugu Global
Andhra Pradesh

నేడు సీఐడీ ముందుకు లోకేష్.. టీడీపీలో ఉత్కంఠ

ఈరోజు కాకపోయినా.. లోకేష్ ని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి. బెయిలురాక చంద్రబాబు ఇబ్బందులు పడుతుంటే.. ఇటు లోకేష్ విచారణ టీడీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

నేడు సీఐడీ ముందుకు లోకేష్.. టీడీపీలో ఉత్కంఠ
X

చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ తొలిసారి సీఐడీ ముందుకు రాబోతున్నారు. ఈరోజే ముహూర్తం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-14గా ఉన్న లోకేష్ ని సీఐడీ పూర్తి స్థాయిలో ఈరోజు విచారించబోతోంది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ ను ఒత్తిడి చేయబోమని సీఐడీ ఇదివరకే స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్‌ 41-ఎఏ కింద నోటీసులు జారీ చేసింది.

టీడీపీలో టెన్షన్..

ఇప్పటికే చంద్రబాబు జైలులో ఉన్నారు, ఈరోజు లోకేష్ సీఐడీ విచారణకు హాజరవుతున్నారు. అసలేం జరుగుతుంది అనే ఉత్కంఠ టీడీపీలో పెరిగిపోయింది. ఈరోజు కాకపోయినా.. లోకేష్ ని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి. బెయిలురాక చంద్రబాబు ఇబ్బందులు పడుతుంటే.. ఇటు లోకేష్ విచారణ టీడీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఢిల్లీనుంచి వచ్చిన లోకేష్..

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్, ఇటీవల ఓసారి విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ఈరోజు సీఐడీ విచారణ ఉండటంతో.. నిన్న(సోమవారం) లోకేష్ ఢిల్లీనుంచి విజయవాడ వచ్చారు. మంగళగిరిలో బస చేశారు. ఈరోజు సీఐడీ ముందు హాజరవుతారు.

First Published:  10 Oct 2023 2:58 AM GMT
Next Story