Telugu Global
Andhra Pradesh

ఆ వీడియో రాజ‌మౌళి గ్రాఫిక్స్ ..స‌ర్టిఫికెట్ ఫేక్.. సీఐడీ చీఫ్ ఏడీజీ సునీల్‌కుమార్

అమెరికాలో ఓ ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చిన స‌ర్టిఫికెట్‌కి ఎటువంటి ప్రామాణిక‌త లేద‌ని స్ప‌ష్టంచేశారు. ఇచ్చిన స‌ర్టిఫికెట్ కూడా ఫేక్ అని ఎక్లిప్స్ జిమ్ ధ్రువీక‌రించారని తెలిపారు.

ఆ వీడియో రాజ‌మౌళి గ్రాఫిక్స్ ..స‌ర్టిఫికెట్ ఫేక్.. సీఐడీ చీఫ్ ఏడీజీ సునీల్‌కుమార్
X

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోగా సోష‌ల్‌మీడియాలో స‌ర్కులేట్ అవుతున్నది గ్రాఫిక్స్ అని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ సునీల్‌కుమార్ తేల్చేశారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌కి తాను మెయిల్ చేయ‌గా వ‌చ్చిన‌ వివ‌రాలను మీడియాకు వెల్ల‌డించారు. రాజమౌళి సినిమాలో చాలా గ్రాఫిక్స్ ఉంటాయ‌ని, ఆ సినిమా ఫోరెన్సిక్ కి పంపి ఒరిజినలా, ఎడిటెడ్ అని అడిగితే ఒరిజినలే అని అంటార‌ని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఓ ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చిన స‌ర్టిఫికెట్‌కి ఎటువంటి ప్రామాణిక‌త లేద‌ని స్ప‌ష్టంచేశారు. ఇచ్చిన స‌ర్టిఫికెట్ కూడా ఫేక్ అని ఎక్లిప్స్ జిమ్ ధ్రువీక‌రించారని తెలిపారు.


ఆ దృశ్యాల‌ను షూట్ చేసిన కెమెరాలు పరిశీలిస్తే కానీ ఎడిటింగ్ జరిగిందా లేదా అనేది చెప్పగలమ‌ని అనంత‌పురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పార‌ని సీఐడీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. ఎక్లిప్స్ పేరిట తప్పుడు సర్టిఫికెట్ స‌ర్కులేట్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయ‌ని సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ హెచ్చ‌రించారు.

First Published:  18 Aug 2022 9:22 AM GMT
Next Story