Telugu Global
Andhra Pradesh

ఏబీఎన్ రాధాకృష్ణకు సోము వీర్రాజు సవాల్

బీజేపీ నేతల అవినీతిపై ఆధారాలుంటే ఇవ్వాలని వారం రోజుల్లోనే చర్యలు తీసుకుంటామన్నారు. వారంలోగా సాక్ష్యాలు చూపకపోతే తప్పుడు కథనాలు ప్రచురించినట్టుగా భావించాల్సి ఉంటుందని.. అప్పుడు ప‌త్రికా ముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఏబీఎన్ రాధాకృష్ణకు సోము వీర్రాజు సవాల్
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి మీడియాపై మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల ఏపీకి చెందిన బీజేపీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పేర్లు రాయకుండా ఆంధ్రజ్యోతి పత్రిక వరుసగా కథనాలు రాస్తోంది. ఆ కథనాలను ప్రస్తావించిన సోము వీర్రాజు.. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఏపీ బీజేపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు.

కనీసం ఆ వ్యక్తులెవరో పేర్లు కూడా చెప్పకుండా బీజేపీపై బురద జల్లేందుకు ఇలాంటి కథనాలు రాస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పుకార్ల వ్యాప్తి, పేరులేని నివేదికల ప్రచురణతో ఎల్లో జర్నలిజం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రజ్యోతి ఒక స్వతంత్ర మీడియా సంస్థగా మీకు మీరు ఊహించుకోవద్దని రాధాకృష్ణను ఉద్దేశించి సోము వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతల అవినీతిపై ఆధారాలుంటే ఇవ్వాలని వారం రోజుల్లోనే చర్యలు తీసుకుంటామన్నారు. వారంలోగా సాక్ష్యాలు చూపకపోతే తప్పుడు కథనాలు ప్రచురించినట్టుగా భావించాల్సి ఉంటుందని.. అప్పుడు ప‌త్రికా ముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వారంలోగా సాక్ష్యాలతో సహా స్పందన లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణను సోము వీర్రాజు హెచ్చరించారు.

First Published:  28 Sep 2022 2:44 PM GMT
Next Story