Telugu Global
Andhra Pradesh

పురందరేశ్వరి ఆన్ డ్యూటీ.. తొలిరోజే జగన్ పై ఘాటు విమర్శలు

కిసాన్ సమ్మాన్ నిధి కేంద్రం ఇస్తుంటే, రైతు భరోసా అంటూ ఆ క్రెడిట్ అంతా రాష్ట్రం కొట్టేస్తోందన్నారు పురందరేశ్వరి. ఇళ్ల నిర్మాణానికి ఏపీకి 9 ఏళ్లలో కేంద్రం 20వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు.

పురందరేశ్వరి ఆన్ డ్యూటీ.. తొలిరోజే జగన్ పై ఘాటు విమర్శలు
X

పురందరేశ్వరి ఆన్ డ్యూటీ.. తొలిరోజే జగన్ పై ఘాటు విమర్శలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందరేశ్వరి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ముందుగా హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్ ఘాట్‌ ను సందర్శించి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన ఆమె, తన నియామకపత్రాన్ని సమాధిపై కాసేపు ఉంచారు. అనంతరం విమానంలో గన్నవరంకు వచ్చారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన భారీ ప్రదర్శనగా విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే ఆమె సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.


సొమ్ము మాది..

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం సొమ్ము ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సోకు చేసుకుంటోందని మండిపడ్డారు పురందరేశ్వరి. కిసాన్ సమ్మాన్ నిధి కేంద్రం ఇస్తుంటే, రైతు భరోసా అంటూ ఆ క్రెడిట్ అంతా రాష్ట్రం కొట్టేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఏపీకి 9 ఏళ్లలో కేంద్రం 20వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. కానీ రాష్ట్రంలో 35 శాతం నిర్మాణాలు కూడా ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, పదో తరగతి బాలుడిపై పెట్రోల్‌ పోసి చంపేశారని, విశాఖలో అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు 2 రోజులున్నారని.. దీనికి కారణం ఎవరన్నారు. ఏపీనుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, కొత్తగా పెట్టుబడులకోసం ఎవరూ ముందుకు రావట్లేదన్నారు.

ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న పురందరేశ్వరి. బీజేపీపై రాష్ట్రంలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. అందర్నీ కలుపుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ఏపీకి కేంద్రం సాయం చేస్తోందని వివరించారు. జనసేన పొత్తు వ్యవహారంపై ఆమె స్పందించలేదు.

First Published:  13 July 2023 8:14 AM GMT
Next Story