Telugu Global
Andhra Pradesh

రెడ్ లైన్ దాటిన టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు..

మూడోరోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానం ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం ఎక్కిన నినాదాలు చేశారు.

రెడ్ లైన్ దాటిన టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు..
X

ఏపీ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు మొదలైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకరోజుపాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారు. ఉదయం బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం సభలో బడ్జెట్ పై చర్చ జరగబోతోంది. ఈ దశలో టీడీపీ సభ్యులు గొడవ చేసి సస్పెండ్ అయ్యారు.

రెడ్ లైన్ దాటి..

మూడోరోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానం ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం ఎక్కిన నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు కాగితాలు చించి సభాపతిపై విసిరివేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ గొడవ చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం లభించింది. వారి గొడవ మరీ పెద్దది కావడంతో స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి ఓటాన్‌ అకౌంట్‌ పద్దు ఆమోదిస్తారు. మొత్తం బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

అదే సమయానికి శాసన మండలిలో ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను చదువుతారు.

First Published:  7 Feb 2024 4:46 AM GMT
Next Story