Telugu Global
Andhra Pradesh

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడేళ్ల తర్వాత బదిలీలకు అవకాశమివ్వడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..
X

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్ డిక్లేర్ అయింది. వారి జీతభత్యాలు పెరిగాయి. అదే సమయంలో వారి బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు మూడేళ్లుగా వారు ఒకేచోట పనిచేస్తున్నారు. మూడేళ్లుగా 15 వేల రూపాయల ఫిక్స్ డ్ శాలరీకి పనిచేసిన వారంతా పనిచేసే చోట నివశించేందుకు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ప్రయాణ ఖర్చులు భరించలేక అవస్థలు పడ్డారు. అలాంటి వారందరికీ ఇప్పుడు ప్రభుత్వం ఊరటనిస్తోంది. బదిలీలకు మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది. మూడేళ్ల తర్వాత బదిలీలకు అవకాశమివ్వడంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలపై త్వరలో ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి.

ఎంపీడీవోలకు పదోన్నతులు..

గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పదోన్నతుల విషయంలో ఎంపీడీవోలు తీవ్ర నిరాశలో ఉన్నారు. తమకు ప్రమోషన్లు ఇక అసాధ్యం అనుకుంటున్న వేళ, వారి పాతికేళ్ల కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. ఏపీలో పదోన్నతులకోసం వేచి చూస్తున్న ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీఓలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టీచర్ల బదిలీలపై సందిగ్ధత..

గతంలో ఉపాధ్యాయులు ఒకేచోట 8 ఏళ్లబాటు బదిలీ సమస్యలేకుండా పనిచేసేవారు. పిల్లల చదువులు, ఇతర వ్యవహారాల్లో వారు ఇబ్బందిపడేవారు కాదు. ఇప్పుడు ఆ కాలాన్ని 8 ఏళ్లనుంచి 5 ఏళ్లకు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు విన్నపాలు ఇచ్చాయి. ఈ విన్నపాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే ఉత్తర్వులు విడుదలయ్యే వరకు బదిలీలపై సందిగ్ధత ఉంటుంది.

First Published:  13 Aug 2022 2:36 AM GMT
Next Story