Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు మ‌రో షాక్.. కొత్తగా మద్యం కేసు

పిటీషన్‌ను కోర్టు విచారణకు అనుమతించింది కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయి.

చంద్రబాబుకు మ‌రో షాక్.. కొత్తగా మద్యం కేసు
X

చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీఐడీ తాజాగా చంద్రబాబు మీద మరో కేసు నమోదుచేసింది. మద్యం కంపెనీల అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి సీఐడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేయటమే కాకుండా ఏసీబీ కోర్టులో విచారణ జరపాలని పిటీషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటీషన్‌లోని ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. విచారణకు స్వీకరించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సీఐడీ కేసు నమోదు చేసి కోర్టులో పిటీషన్ వేసింది.

పిటీషన్‌ను కోర్టు విచారణకు అనుమతించింది కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ కేసులో ఏ-1గా నరేష్, ఏ-2 గా కొల్లు రవీంద్రను చేర్చిన సీఐడీ చంద్రబాబును ఏ-3గా చేర్చింది. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చినప్పుడే చంద్రబాబుపైన ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అలాంటిది ఇంతకాలానికి ఉరుములేని పిడుగులా ఒకేసారి కేసు నమోదవ్వటం, కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం, దాన్ని కోర్టు విచారణకు స్వీకరించటం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇప్పటికే చంద్రబాబు స్కిల్ స్కామ్ లో ఇరుక్కొని అరెస్టయి 52 రోజులుగా రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. కేసు నుంచి బయటపడటం దేవుడెరుగు.. ముందు బెయిల్ తెచ్చుకుని కారాగారం నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక చంద్రబాబుకు దిక్కుతోచ‌డంలేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లను ఎంతమందిని దింపినా ఎలాంటి ప్ర‌యోజ‌నం కనబడలేదు. నిజానికి చంద్రబాబు అరెస్టయిన స్కిల్ స్కామ్ కేవలం రు. 371 కోట్లు మాత్రమే.

ఇంతకన్నా పెద్ద కేసులైన ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, అంగళ్ల‌ అల్లర్ల కేసులు చాలా ఉన్నాయి. ఒక కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు వల్ల కావటంలేదు. అలాంటిది ఇన్ని కేసుల్లో నుంచి ఎప్పుడు బయటపడతార‌నేది ప్ర‌శ్నార్థ‌కం. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మద్యం కంపెనీలకు అనుమతుల్లో అక్రమాలపై కేసు తాజాగా నమోదైంది.

First Published:  30 Oct 2023 1:51 PM GMT
Next Story