Telugu Global
Andhra Pradesh

నేను మాట్లాడుతుంటే బెట్టింగ్ బంగార్రాజు అన్న కామెంట్స్‌.. ఆ పాపం ఎవరిది?

ఈ వార్నింగ్‌కు అనిల్‌ కుమార్ యాదవ్‌ స్పందించారు. రూప్‌కుమార్‌ ఒక అంతర్జాతీయ దొంగ అని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయి నోటీసులు వచ్చిన విషయం తనకు తెలుసని దాన్ని లీక్ చేయడానికి ఐదు నిమిషాలు చాలని హెచ్చరించారు.

నేను మాట్లాడుతుంటే బెట్టింగ్ బంగార్రాజు అన్న కామెంట్స్‌.. ఆ పాపం ఎవరిది?
X

నెల్లూరు సిటీ వైసీపీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, అతడి బాబాయ్‌, నగర డిప్యూటీ మేయర్ రూప్‌ కుమార్‌ పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో తనతో ఉన్న హాజీ అనే అనుచరుడు ఇటీవల రూప్‌ కుమార్ వైపు వెళ్లడంతో దాన్ని జీర్ణించుకోలేక అతడిపై అనిల్ కుమార్‌ దాడి చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. హాజీని పరామర్శించిన రూప్‌ కుమార్‌ అబ్బాయి అనిల్ కుమార్‌ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

తామంతా కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు తమపైనే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. చెప్పు తినే కుక్క చెరుకు తీపి ఎరుగునా అన్నట్టుగా అనిల్ పరిస్థితి ఉందంటూ విమర్శించారు. అల్పబుద్ది కలవాడిని అందలం ఎక్కించామంటూ మాట్లాడారు. తాను అన్ని తెలిసిన వ్యక్తినని తాను నోరు తెరిస్తే అడ్రస్‌ గల్లంతు అవుతుందంటూ అనిల్‌ కుమార్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. తాము ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే పరిస్థితి నీ ఊహకే అందదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ వార్నింగ్‌కు అనిల్‌ కుమార్ యాదవ్‌ స్పందించారు. రూప్‌కుమార్‌ ఒక అంతర్జాతీయ దొంగ అని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయి నోటీసులు వచ్చిన విషయం తనకు తెలుసని దాన్ని లీక్ చేయడానికి ఐదు నిమిషాలు చాలని హెచ్చరించారు. తన జోలికి వస్తే పైనుంచి కింద వరకు చర్మం వలిచేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను మీడియాతో మాట్లాడుతుంటే కింద బెట్టింగ్ బంగార్రాజు అంటూ వరుసగా కామెంట్స్ వస్తుంటాయని.. ఆ పాపం ఎవరిది అని ప్రశ్నించారు.

బెట్టింగ్ బంగార్రాజు అన్న పాపాన్ని నేను మోయడం లేదా అని ప్రశ్నించారు.పరోక్షంగా రూప్‌ కుమార్‌ చేసిన పనులకు తాను నిందలు మోస్తున్నానని వివరించే ప్రయత్నం చేశారు. నీ అంతు తేలుస్తాం.. నీ అణువణువు తెలుసు అంటూ వార్నింగ్‌లు ఇస్తే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు. ఇంతకాలం ఓర్పుగా ఉన్నానని ఇకపై సహించే ప్రసక్తే లేదని అనిల్ కుమార్ చెప్పారు.

First Published:  21 May 2023 7:56 AM GMT
Next Story