Telugu Global
Andhra Pradesh

మంత్రి రోజాకు అస్వ‌స్థ‌త‌

నిత్యం రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండే రోజా ప‌ది రోజులుగా మీడియాకు దూరంగా ఉండ‌టంపై ఆరా తీయ‌గా, ఈ విష‌యం వెల్ల‌డైంది.

మంత్రి రోజాకు అస్వ‌స్థ‌త‌
X

ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్‌కే రోజా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల ఆమెకు కాలు బెణ‌క‌డంతో వారం రోజుల పాటు ఫిజియోథెర‌పీ చేయించారు. అయినా నొప్పి త‌గ్గ‌క‌పోవ‌డంతో.. చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స కోసం చేరిన‌ట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

నిత్యం రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండే రోజా ప‌ది రోజులుగా మీడియాకు దూరంగా ఉండ‌టంపై ఆరా తీయ‌గా, ఈ విష‌యం వెల్ల‌డైంది. కాలు బెణక‌డం వ‌ల్లే 10 రోజుల నుంచి రోజా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

First Published:  11 Jun 2023 7:39 AM GMT
Next Story