Telugu Global
Andhra Pradesh

పవన్ పక్కదారి పట్టిస్తున్నారా ?

జనసేన కార్యకర్తల అరెస్టులపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనాలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉంది. మీడియా సమావేశంలో మాట్లాడుతు శనివారం జరిగిన ర్యాలీలో తనపక్కనే నిలబడిన కారణంగా 15 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

పవన్ పక్కదారి పట్టిస్తున్నారా ?
X

జనసేన కార్యకర్తల అరెస్టులపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనాలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉంది. మీడియా సమావేశంలో మాట్లాడుతు శనివారం జరిగిన ర్యాలీలో తనపక్కనే నిలబడిన కారణంగా 15 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ర్యాలీకి అనుమతి అడిగినపుడు రిక్వెస్టు లెటర్లో సంతకాలు చేసిన 15 మందిపై పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ర్యాలీకి పర్మీషన్ అడుగుతు పార్టీనుండి లెటర్ ఇచ్చేటపుడు 15 మంది సంతకాలు ఎందుకు చేయాలి ?

పార్టీతరపున ఏ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా పర్మీషన్ కోసం ఎవరో ఒక బాధ్యుడు సంతకంతో లెటర్ పెట్టుకుంటే సరిపోతుందికదా. సరే ఇక్కడ పోలీసులు అరెస్టులు చేసింది లెటర్లలో సంతకాలు పెట్టారని కాదు. శనివారం సాయంత్రం విమానాశ్రయంలో మంత్రుల కార్లపై దాడులు చేశారన్న కారణంతోనే. తమ కార్యకర్తలపై పోలీసులు 307 సెక్షన్ కింద కేసులు పెడతారా ? 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసుకదా అని పవన్ ఆశ్చర్యపోయారు. మంత్రుల కార్లపైన దాడులుచేశారు కాబట్టే పోలీసులు 307 సెక్షన్ కింద కేసులు పెట్టారు.

మంత్రులపై దాడులుచేసిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి కేసులు పెడుతున్నారు. ఇప్పటికి 100 మందిని అరెస్టుచేశారు. సాయంత్రం మంత్రులకార్లపై దాడులు చేసిన వారంతా పవన్ బసచేసిన హోటల్లో దాక్కున్నారు. అంటే పవన్ తో పాటు ఉంటే పోలీసులు వచ్చి అరెస్టులు చేయలేరని అనుకునుండచ్చు. అయితే పోలీసులు హోటల్లోకి వెళ్ళి దొరికినవారిని అరెస్టులు చేశారు. ఇక్కడే పవన్ కు బాగా మండుంటుంది.

మంత్రుల కార్లపై దాడులుచేసినందుకు పోలీసులు అరెస్టులు చేస్తే పవన్ మాత్రం ర్యాలీ పర్మీషన్ అడిగారని అరెస్టులు చేశారని చెప్పి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ర్యాలీకి పర్మీషన్ అడిగితే పోలీసులు ఎందుకు అరెస్టులు చేస్తారు. పర్మీషన్ ఇవ్వటం ఇష్టంలేకపోతే నిరాకరిస్తారంతే కానీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి అరెస్టులు చేసేస్తారా ? మంత్రుల కార్లపై దాడులుచేసింది తమ కార్యకర్తలే అని అంగీకరించలేక జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్లే అనుమానంగా ఉంది.

First Published:  16 Oct 2022 7:05 AM GMT
Next Story