Telugu Global
Andhra Pradesh

కక్షిదారులు కులం, మతం చెప్పక్కర్లేదు.. - స్పష్టం చేసిన హైకోర్టు

హైకోర్టు, కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే కక్షిదారులు ఎవరూ తమ పిటిషన్లు, ఇతర ప్రాసీడింగ్స్‌ ఎక్కడా తమ కులం, మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

కక్షిదారులు కులం, మతం చెప్పక్కర్లేదు.. - స్పష్టం చేసిన హైకోర్టు
X

కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే కక్షిదారులు ఎవరూ తమ పిటిషన్లు, ఇతర ప్రాసీడింగ్స్‌లో ఎక్కడా తమ కులం, మతం గురించి ప్ర‌స్తావించాల్సిన అవసరం లేదని రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలను ఏపీ హైకోర్టు ఆదేశించింది. షామా శర్మ వర్సెస్‌ కిషన్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు, కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే కక్షిదారులు ఎవరూ తమ పిటిషన్లు, ఇతర ప్రాసీడింగ్స్‌ ఎక్కడా తమ కులం, మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అన్ని న్యాయస్థానాలు పాటించాలని ఆదేశించింది. తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని దేశంలోని అన్ని హైకోర్టులనూ ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అన్ని న్యాయస్థానాలు తప్పక పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

హైకోర్టు న్యాయవాదుల సంఘంతో పాటు రాష్ట్రంలోని అన్ని న్యాయవాద సంఘాలు కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాల గురించి తెలియజేసింది. ఇందుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వై.లక్ష్మణరావు ఒక సర్కులర్‌ జారీ చేశారు.

First Published:  23 Feb 2024 6:27 AM GMT
Next Story