Telugu Global
Andhra Pradesh

మంత్రుల‌పై సీఎం జ‌గ‌న్‌ సీరియ‌స్‌

మంత్రుల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మంత్రుల‌పై సీఎం జ‌గ‌న్‌ సీరియ‌స్‌
X

మంత్రుల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేబినెట్ స‌మావేశం ముగిసిన వెంట‌నే రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చ సాగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ముఖ్య‌మంత్రి మంత్రుల‌ని తీవ్రంగా మంద‌లించారు.

ప్రతిప‌క్షం చేస్తున్న ఆరోపణలకు మంత్రులు కౌంటర్‌ ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. త‌న‌ కుటుంబ సభ్యులపై తీవ్ర‌ ఆరోపణలు చేసినా కూడా స్పందించక‌పోవ‌డం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వంపైనా ప్ర‌తీనిత్యం బురద జల్లుతుంటే ప్ర‌తిస్పందించ‌క‌పోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు.

ఆరోపణలను ఖండించకుంటే, అవే వాస్త‌వాలుగా ప్ర‌చారం అవుతాయ‌న్నారు. మీ అందరికి పదవులు ఇచ్చింది ఎందుకని నిల‌దీశారు. పనితీరు ఇలాగే ఉంటే మరోసారి కేబినెట్‌లో మార్పులు చేయాల్సి వ‌స్తుంద‌ని తీవ్ర‌స్వ‌రంలో హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది. మంత్రులు ఇప్ప‌టికైనా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

First Published:  7 Sep 2022 9:56 AM GMT
Next Story