Telugu Global
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్.. 2.79 లక్షల కోట్ల కేటాయింపులు

ఈరోజు కూడా బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి టీడీపీ నేతలు ప్రయత్నించగా స్పీకర్‌ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారు తగ్గకపోవడంతో సస్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్.. 2.79 లక్షల కోట్ల కేటాయింపులు
X

2023-24 సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్ల రూపాయలతో ఈబడ్జెట్ రూపొందించారు. పేద ప్రజలు, బలహీన వర్గాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్నారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేసినట్లు చెప్పారు.

బడ్జెట్ కి ముందుగా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతరం బడ్జెట్ ప్రతులను సచివాలయం రెండో బ్లాక్‌ లోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశ పెట్టారు.


సంక్షేమ పథకాలకు 54,228 కోట్లు..

అత్యథికంగా సంక్షేమ పథకాలకు 54,228.36 కోట్ల రూపాయలు ఏపీ బడ్జెట్ లో కేటాయించారు. పెన్షన్‌ కానుకకు రూ.21,434.72 కోట్లు, అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు, రైతు భరోసాకు రూ.4,020 కోట్లు, విద్యాదీవెనకు రూ.2,841.64 కోట్లు, వసతి దీవెనకు రూ.2,200 కోట్లు, బీమా యోజన పథకానికి రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలకోసం రూ.500 కోట్లు, కాపు నేస్తంకు రూ. 550 కోట్లు, చేదోడుకోసం రూ.350 కోట్లు, వాహనమిత్రకు రూ.275 కోట్లు, నేతన్న నేస్తానికి రూ.200 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.125 కోట్లు కేటాయించినట్టు తెలిపారు మంత్రి. రైతులకోసం ధర స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకోసం రూ. 1,212 కోట్ల కేటాయింపులు జరిగాయి.

ముందుగానే టీడీపీ నేతల సస్పెన్షన్..

నిన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సహా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మిగతావారిని కేవలం ఒకరోజు మాత్రమే సస్పెండ్ చేశారు. ఈరోజు కూడా బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి టీడీపీ నేతలు ప్రయత్నించగా స్పీకర్‌ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. అయినా వారు తగ్గకపోవడంతో సస్పెండ్ చేశారు.

First Published:  16 March 2023 5:22 AM GMT
Next Story