Telugu Global
Andhra Pradesh

ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేసిన ఆంధ్రజ్యోతి..

ఫిర్యాదులను హైలైట్ చేయడం ఓకే. కానీ వారేదో తప్పు చేసినట్టు, వారిని ఈసీ బదిలీ చేసేసినట్టు, చివరకు కొత్తగా వచ్చేవారి పేర్లు కూడా ఆంధ్రజ్యోతి పేర్కొనడం మాత్రం బరితెగింపుకి పరాకాష్ట.

ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేసిన ఆంధ్రజ్యోతి..
X

ఎన్నికల వేళ ఎల్లో మీడియా బరితెగించింది. అందులోనూ ఆంధ్రజ్యోతి మరిన్ని తప్పుడు వార్తలు రాస్తోంది. ఎన్నికల సంఘాన్ని బెదిరించేలా, ప్రభావితం చేసేలా ఆ వార్తలుంటున్నాయి. తాజాగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ దాదాపుగా తొలగించేసినట్టు వార్తలిచ్చింది ఆంధ్రజ్యోతి. సీఎస్, డీజీపీ ఔట్..!? అంటూ ఆంధ్రజ్యోతి క్వశ్చన్ మార్క్ తో హెడ్డింగ్ పెట్టినా.. లోపల కథనంలో విషాన్నంతా వెళ్లగక్కింది.

సీఎస్, డీజీపీతోపాటు మరో ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్ లపై కూడా ఈసీ వేటు వేస్తుందని తీర్మానించింది సదరు పత్రిక యాజమాన్యం. నేడే రేపో ఉత్తర్వులు వస్తాయని కూడా తేల్చి చెప్పడం విశేషం. ఈసీ ఆదేశాలను సైతం బేఖాతరు చేసి, వారు జగన్ సేవలో తరిస్తున్నారని, అందుకే వారిపై బదిలీ వేటు పడుతోందని చెప్పుకొచ్చింది. ఇక ఈసీ వేటు తర్వాత ఆయా స్థానాల్లోకి ఎవరు వస్తారనేది కూడా ఆంధ్రజ్యోతి డిసైడ్ చేయడం ఇక్కడ కొసమెరుపు. సీఎస్ గా జవహర్ రెడ్డి స్థానంలో సిసోడియా, డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ద్వారకా తిరుమలరావుకి పోస్టింగ్ లు ఇస్తున్నట్టు చెప్పింది.

ఎందుకీ బ్లాక్ మెయిలింగ్..

ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఓ లిస్ట్ పట్టుకుని ఈసీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. పదే పదే వారు అవే ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఓసారి, పవన్ మరోసారి, పురంధేశ్వరి ఇంకోసారి.. వీరు చాలదన్నట్టు ఆ పార్టీ ప్రతినిధులు గుంపుగా వెళ్లిమరీ ఈసీకి ఫిర్యాదులిస్తున్నారు. ఆ ఫిర్యాదుల వరకు హైలైట్ చేయడం ఓకే, అందులో ఉన్న పేర్లను ప్రచురించడం వరకు ఓకే. కానీ వారేదో తప్పు చేసినట్టు, వారిని ఈసీ బదిలీ చేసేసినట్టు, చివరకు కొత్తగా వచ్చేవారి పేర్లు కూడా ఆంధ్రజ్యోతి పేర్కొనడం మాత్రం బరితెగింపుకి పరాకాష్ట. మరి ఇలాంటి కథనాలపై ఈసీ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

First Published:  19 April 2024 1:12 AM GMT
Next Story