Telugu Global
Andhra Pradesh

ఆ సైకిల్ ని మతడతపెట్టి..

ఇలాంటి చిన్న చిన్న డైలాగులతోనే ట్వీట్లు వేస్తుంటారు అంబటి. ఈసారి ఆయనకు టైమింగ్ బాగా కలిసొచ్చింది. సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న బూతుని, మహేష్ బాబు సినిమాతో ఇంకా పాపులర్ అయిన ఆ పదాన్ని కన్వీనియంట్ గా టీడీపీకి ముడిపెట్టేశారు.

ఆ సైకిల్ ని మతడతపెట్టి..
X

బూతు.. బూతు.. మంత్రి అంబటి రాంబాబు పెద్ద 'బీప్' ట్వీట్ వేశారు. అయితే ఎవరూ దాన్ని 'బూతు' అని నేరుగా అనలేరు. అలాగని ఆ ట్వీట్ ఘాటుని ఎవరూ తగ్గించలేరు. ఆ రేంజ్ లో టీడీపీపై సెటైర్ పేల్చారు అంబటి. ఆ సైకిల్ ని మడతపెట్టి అంటూ అంబటి వేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేతలకు ఓ రేంజ్ లో మంట పెట్టింది.


ఆ కుర్చీని మడతపెట్టి..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. ఓ ముసలాయన్ని ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో అనుకోకుండా దొర్లిన బూతు ఇది. దాన్ని సోషల్ మీడియా వైరల్ గా మార్చింది. ఎంతలా అంటే మహేష్ బాబు కొత్త సినిమా పాటలో హుక్ లైన్ గా వాడుకునేంతలా. బూతు అంటే పరమ రోత అని అనుకునే దర్శకుడు త్రివిక్రమ్ కూడా కాలంతోపాటు వెళ్లక తప్పదు అన్నట్టుగా ఆ కుర్చీని మడతపెట్టేశారు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమాకి ఈ పాట ఎక్కడలేని ఊపు తెస్తోంది. సోషల్ మీడియాలో మహేష్ బాబు 'కుర్చీని మడతపెట్టి' అనే పాట గురించి మాట్లాడుకుంటున్న టైమ్ లో అంబటి రాంబాబు ఈ ట్వీట్ వేయడం విశేషం.

''ఆ సైకిల్ మడతపెట్టి

ఈ గ్లాస్ చితగ్గొట్టి

మన ఫ్యాను స్పీడ్ పెంచుదాం!'' అంటూ అంబటి వేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. సహజంగా ఆయన ఇలాంటి చిన్న చిన్న డైలాగులతోనే ట్వీట్లు వేస్తుంటారు. ఈసారి ఆయనకు టైమింగ్ బాగా కలిసొచ్చింది. సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న బూతుని, మహేష్ బాబు సినిమాతో ఇంకా పాపులర్ అయిన ఆ పదాన్ని కన్వీనియంట్ గా టీడీపీకి ముడిపెట్టేశారు అంబటి. 'ఆ సైకిల్ ని మడతపెట్టి' అంటూ పంచ్ డైలాగు వదిలారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా దీన్ని బాగా పాపులర్ చేస్తోంది.

First Published:  2 Jan 2024 2:24 AM GMT
Next Story