Telugu Global
Andhra Pradesh

ఐయామ్ లెస్ కరప్ట్.. వైరల్ అవుతున్న అంబటి పాత వీడియో

మంత్రి అంబటి రాంబాబు నిన్న సిద్ధం సభలో టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే ఆయన వీడియో బయటకొచ్చింది.

ఐయామ్ లెస్ కరప్ట్.. వైరల్ అవుతున్న అంబటి పాత వీడియో
X

ఐయామ్ లెస్ కరప్ట్ అంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అవి ఇప్పటివి కావు, మూడు వారాల క్రితం ఆయన ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని చిన్న బిట్ అది. తాను అవినీతిపరుడిని కాదు అని చెప్పే క్రమంలో తక్కువ అవినీతిపరుడిని అంటూ ఆయన చెప్పిన మాటల్ని హైలైట్ చేస్తూ టీడీపీ, జనసేన సెటైర్లు పేలుస్తున్నాయి. ఎన్నికల వేళ అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అవినీతి పరుడిని కాదు అని చెప్పలేను అన్నారు అంబటి రాంబాబు. ఐయామ్ లెస్ కరప్ట్ అన్నారు, 100 కెమెరాలున్నా లెస్ కరెప్ట్ అని ఒప్పుకుంటున్నా అని చెప్పారు. అధికారాన్ని ఎక్కడైనా దుర్వినియోగం చేస్తే అది కరప్షన్ అవుతుందని, మంత్రిగా అక్కడక్కడా తమ అధికారం దుర్వినియోగం అయి ఉంటుందేమో అందుకే లెస్ కరెప్ట్ అని అంటున్నానని వివరణ ఇచ్చారు. సరిగ్గా ఈ పాయింట్ నే ఎల్లో మీడియా బయటకు తీసింది. లెస్ కరెప్ట్ అంటున్న అంబటి అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తోంది.


మంత్రి అంబటి రాంబాబు నిన్న సిద్ధం సభలో టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే ఆయన వీడియో బయటకొచ్చింది. అది కూడా మూడు వారాల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు అనుకూలంగా ఉన్న పార్ట్ ని కట్ చేసి అంబటి తప్పు చేశారంటూ హడావిడి చేస్తున్నారు. టీడీపీ, జనసేన అనుచరులు అంబటిని టార్గెట్ చేస్తున్నారు. మరి దీనిపై అంబటి తాజాగా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.

First Published:  11 March 2024 7:52 AM GMT
Next Story