Telugu Global
Andhra Pradesh

అక్కడ డెలివరీ బాయ్స్ లేరు.. డెలివరీ గర్ల్స్ మాత్రమే...

రాజమండ్రిలో అమెజాన్ సంస్థ ఏర్పాటు చేసిన ఆల్ ఉమెన్ డెలివరీ కేంద్రం ఇండియాలోనే అతిపెద్దది కావడం విశేషం. ఇందులో మొత్తం 50 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు.

అక్కడ డెలివరీ బాయ్స్ లేరు.. డెలివరీ గర్ల్స్ మాత్రమే...
X

ఆన్‌లైన్ బిజినెస్‌లు ఊపందుకున్న వేళ, డెలివరీ బాయ్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఇతర ఉద్యోగాలు చేస్తున్నవారు, స్టూడెంట్స్ కూడా డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. మహిళలు కూడా ఈ రంగంలో ఇప్పుడిప్పుడే తమ ఉనికి చాటుకుంటున్నారు. అయితే ఏకంగా మొత్తం మహిళలతోనే డెలివరీ యూనిట్ నెలకొల్పింది అమెజాన్ సంస్థ. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఏడు ఉమెన్ డెలివరీ కేంద్రాలున్నాయి. వాటిలో రెండు ఏపీలోనే ఉండటం విశేషం. గతంలో ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆల్ ఉమెన్ డెలివరీ కేంద్రం ఉండగా.. ఇప్పుడు కొత్తగా రాజమండ్రిలో మరో డెలివరీ యూనిట్ ప్రారంభించింది.

ఏపీకి అరుదైన గౌరవం..

రాజమండ్రిలో అమెజాన్ సంస్థ ఏర్పాటు చేసిన ఆల్ ఉమెన్ డెలివరీ కేంద్రం ఇండియాలోనే అతిపెద్దది కావడం విశేషం. ఇందులో మొత్తం 50 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. డెలివరీ గర్ల్స్ తోపాటు, అమెజాన్ డిస్పాచ్ యూనిట్‌లో పనిచేసేవారంతా మహిళలే కావడం విశేషం. డెలివరీ సర్వీస్ పార్టనర్స్ తో కలిసి ఈ ఆల్ ఉమెన్ డెలివరీ కేంద్రాన్ని అమెజాన్ సంస్థ ఏర్పాటు చేసింది.

సరికొత్త ఉపాధి మార్గాలు..

అమెజాన్ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యథిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద అమెజాన్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. తెలంగాణలో పెద్ద ఎత్తున గోడౌన్లు నిర్మిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది. ఇటు ఏపీ విషయానికొస్తే, దేశంలోనే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్న ఆల్ ఉమెన్ డెలివరీ కేంద్రాన్ని ప్రారంబించింది. దేశంలో ఇలాంటి డెలివరీ యూనిట్లు కేవలం ఏడు మాత్రమే ఉండగా, అందులో రెండు ఏపీలోనే ఉండటం విశేషం.

First Published:  15 Sep 2022 10:00 AM GMT
Next Story