Telugu Global
Andhra Pradesh

ఆ సీనియర్ నటిని బాలకృష్ణ వేధించారా..? టీడీపీ, వైసీపీ ట్విట్టర్ వార్

మొత్తమ్మీద బాలయ్య మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ప్రస్తుతం వెన్నెరాడై నిర్మల.. బాలయ్య పేరు చెప్పకపోయినా, గతంలో కొంతమంది హీరోయిన్లు ఆయనపై నేరుగానే కామెంట్లు చేశారు.

ఆ సీనియర్ నటిని బాలకృష్ణ వేధించారా..? టీడీపీ, వైసీపీ ట్విట్టర్ వార్
X

హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గతంలో తనను వేధింపులకు గురి చేశాడంటూ ఓ సీనియర్ నటి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్యపై ఆరోపణలు కాబట్టి సహజంగానే టీడీపీ అనుకూల మీడియా దాన్ని పట్టించుకోలేదు, వైరి వర్గం దాన్ని వైరల్ చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కూడా ఆ ఇంటర్వ్యూ వీడియో హైలైట్ అవుతోంది. బాలకృష్ణను హీరోయిన్లను వేధిస్తారని, అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులపై వేధింపులకు పాల్పడతారని, అర్ధరాత్రి హీరోయిన్లు డోర్‌ కొట్టడం బాలకృష్ణకు అలవాటని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర, తదితరులు బాలయ్యపై ఇదే విధమైన విమర్శలు చేశారని, ఇప్పుడు సీనియర్ నటి కూడా తన బాధ బయటపెట్టిందని కామెంట్లు జోడించి, ఆ వీడియోని జతచేశారు.



టీడీపీ రియాక్షన్..

వెన్నెరాడై నిర్మల ఇంటర్వ్యూలో ఎక్కడా బాలయ్య పేరు చెప్పలేదని, వైసీపీ వాళ్లు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ సోషల్ మీడియాలో కౌంటర్లు పెడుతున్నారు. గతంలో ఆమె ఇచ్చిన మరో ఇంటర్వ్యూని వాళ్లు సర్కులేట్ చేస్తున్నారు. బాలయ్య మంచివాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


మొత్తమ్మీద బాలయ్య మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ప్రస్తుతం వెన్నెరాడై నిర్మల.. బాలయ్య పేరు చెప్పకపోయినా, గతంలో కొంతమంది హీరోయిన్లు ఆయనపై నేరుగానే కామెంట్లు చేశారు. కొన్ని సినిమా ఫంక్షన్లలో బాలయ్య మహిళలపై అసభ్య కామెంట్లు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఉదాహరణలతోనే ఇప్పుడాయన్ను అందరూ కార్నర్ చేశారు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకోవడం, వైసీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ మొదలు కావడం విశేషం.

First Published:  28 Feb 2024 5:10 AM GMT
Next Story