Telugu Global
Andhra Pradesh

తొడలు కొడుతూ రెచ్చగొట్టిన అమరావతి మహిళలు

అమరావతివాదులు కొందరు మీసాలు తిప్పారు. గుడివాడలో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని పాదయాత్ర వారు ఆరోపించారు. తమ పాదయాత్రకు ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ వెళ్తామని జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

తొడలు కొడుతూ రెచ్చగొట్టిన అమరావతి మహిళలు
X

గుడివాడలో అమరావతి జేఏసీ పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పడింది. అమరావతివాదులు రెచ్చిపోయారు. పాదయాత్ర గుడివాడ చేరిన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొడాలి నానిని చెందిన కార్యాలయం వద్దకు రాగానే అమరావతివాదులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని అనుచరులు కూడా ప్రతిగా జై కొడాలి అంటూ నినాదాలు చేశారు. ఎవరిపై ఒకరు దూసుకొచ్చారు.

ఈ సమయంలో అమరావతివాదులు కొందరు మీసాలు తిప్పారు. గుడివాడలో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని పాదయాత్ర వారు ఆరోపించారు. తమ పాదయాత్రకు ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ వెళ్తామని జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే కొడాలి నాని బయటకు రావాలని మీసం తిప్పి, తొడ కొట్టారాయన. టీడీపీ నేత మాగంటి బాబు వైసీపీ కార్యాలయం వైపు చెప్పు చూపిస్తూ బూతులు తిట్టారు.

వైసీపీ కార్యాలయం వద్ద పాదయాత్ర వాహనాన్ని ఆపి పాటలు పాడారు. రెచ్చగొట్టే పనులు చేయవద్దని పోలీసులు హెచ్చరించి వారిని పంపించారు. గుడివాడలో పాదయాత్రకు గుంటూరు జిల్లాకు చెందిన యరపతినేని శ్రీనివాస్ రావు వచ్చారు. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా వెళ్లారు. అయితే మార్గమధ్యలోనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు రావడం, వైసీపీ, కొడాలి కార్యాలయాల వద్ద అమరావతి వాదులు నినాదాలు చేయడం, ఇవన్నీ రెచ్చగొట్టే చర్యలు కాదా అని కొడాలి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్నమహిళలు కొందరు వచ్చాం వచ్చాం గుడివాడ వచ్చామంటూ నినాదాలు చేస్తూ తోడలు కొట్టారు.

First Published:  24 Sep 2022 1:36 PM GMT
Next Story