Telugu Global
Andhra Pradesh

రష్మిక డీప్ ఫేక్‌ వీడియో.. వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్‌‌ వార్‌

రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వ్యభిచార కేంద్రాలు నడిపి చివరకు అమెరికా పోలీసులకు చిక్కింది మీ వాళ్లేనంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

రష్మిక డీప్ ఫేక్‌ వీడియో.. వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్‌‌ వార్‌
X

హీరోయిన్‌ రష్మిక మందన డీప్‌ఫేక్‌ వీడియో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీకి చెందిన బీటెక్ విద్యార్థి ఈమని నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయమై ఇప్పుడు ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ట్విట్టర్‌ వార్ నడుస్తోంది.

నవీన్‌ వైసీపీ అభిమాని అంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇదే అదునుగా జగన్‌పైనా విమర్శలు ఎక్కుపెట్టింది తెలుగుదేశం. పార్టీ నడుపుతున్నావా, క్రిమినల్స్‌ని, డెకాయిట్‌లను తయారు చేస్తున్నావా..? అంటూ టీడీపీ త‌న ట్వీట్‌కి వై ఏపీ హేట్స్ జగన్ హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.


తెలుగుదేశం విమర్శలపై ఘాటుగా స్పందించింది వైసీపీ. తెలుగుదేశం పార్టీకి దాని చరిత్రను గుర్తుచేసింది. రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వ్యభిచార కేంద్రాలు నడిపి చివరకు అమెరికా పోలీసులకు చిక్కింది మీ వాళ్లేనంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీ అధికారిక వృత్తి, నాయకుల ప్రవృత్తి వ్యభిచారమే కదా అంటూ చురుకులు పెట్టింది. తెలుగుదేశం పార్టీ మనుగడకు అదే కేంద్రమని.. పేర్లు రాసుకుంటూ వెళ్తే వంద పేజీలు అవుతాయని తన ట్వీట్‌లో పేర్కొంది వైసీపీ. ఆ విషయం మరిచిపోయి ట్వీట్స్‌ పెడితే ఎలా అంటూ ప్రశ్నించింది. అసలు సైకిల్ గుర్తు దక్కిందే వ్యభిచారం ఆధారంగా కదా.. సరిపోద్దా ఇంకా ఆధారాలు ఏమైనా కావాలా అంటూ ట్వీట్ చేసింది.

First Published:  22 Jan 2024 5:14 AM GMT
Next Story