Telugu Global
Andhra Pradesh

రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి

టీడీపీ నుంచి తనకు ఆఫర్ ఉన్న మాట 100 శాతం నిజమన్నారు. ఇప్పటికే లోకేష్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్టు వివరించారు.

Sapthagiri joins TDP: రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి
X

Sapthagiri joins TDP: రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి

ప్ర‌ముఖ సినీ నటుడు సప్తగిరి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన టీడీపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని సప్తగిరే తిరుపతిలో వెల్లడించారు. టీడీపీ నుంచి తనకు ఆఫర్ ఉన్న మాట 100 శాతం నిజమన్నారు. ఇప్పటికే లోకేష్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్టు వివరించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెప్పడం ఇప్పుడే కరెక్ట్ కాదని.. ఓ 10, 15 రోజుల్లో అన్ని విషయాలను తప్పకుండా చెబుతానన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది నారా లోకేషే నిర్ణయిస్తారన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూస్తూ పెరిగిన వ్యక్తిని తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినా సినీ పరిశ్రమలో తరహాలోనే క్రమశిక్షణతో పనిచేస్తానని వివరించారు. తనది చిత్తూరు జిల్లా అని, పుట్టింది ఐరాలలో అని స‌ప్త‌గిరి వెల్లడించారు.

First Published:  12 Jun 2023 9:54 AM GMT
Next Story