Telugu Global
Andhra Pradesh

రామోజీ బండారం బయటపెట్టిన పోసాని..!

కుట్రలతో ఎన్టీఆర్‌ దగ్గర పార్టీని లాక్కున్నది చంద్రబాబు కాదా? వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు.

రామోజీ బండారం బయటపెట్టిన పోసాని..!
X

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ.. రామోజీరావు బండారం బయటపెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిలను రామోజీ నే తిట్టారని ఆయన గుర్తు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. పవన్ వ్యక్తిగత విషయాలు ప్రచారంలో వచ్చేలా చేసింది రామోజీనేనని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం పవన్.. రామోజీకి నీతి మంతుడిలా కనపడుతున్నాడా అని ఆయన ప్రశ్నించారు.

కుట్రలతో ఎన్టీఆర్‌ దగ్గర పార్టీని లాక్కున్నది చంద్రబాబు కాదా? వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ సీఎం అయితే తాము ఏమైపోతామోననే భయం రామోజీ, చంద్రబాబులో మొదలైందని పోసాని అన్నారు.

చంద్రబాబు అవకాశవాది అని, తన స్వలాభం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడన్నారు. చంద్రబాబు మోసాలు చేస్తాడు కాబట్టే జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుంటాడన్నారు. రామోజీ మార్గదర్శి సంస్థను పెట్టింది ఎవరి డబ్బుతో అని పోసాని ప్రశ్నించారు. అందులో ఉన్న డబ్బంతా రామోజీ పందికొక్కులా తిన్నారని ఆరోపించారు.

మానవత్వం, స్నేహభావం ఉన్నవారే వాలంటీర్లని, అలాంటి వారిపైనే విష ప్రచారం చేస్తావా అంటూ రామోజీరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రికను ఆఖరికి టాయిలెట్‌ పేపర్‌గా మాత్రమే వాడతారని ఎద్దేవా చేశారు. పచ్చిగా మాట్లాడటం తప్పుకాదు.. అబద్ధం చెప్పడం తప్పని ఆయన అన్నారు. వైఎస్‌ జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది బీజేపీతో పొత్తు కోసమేనని జరుగుతున్న చర్చపై కూడా పోసాని మాట్లాడారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నమాట వాస్తవమేనని, కానీ అందుకు బీజేపీ అంగీకరిస్తే.. ఆ పార్టీకి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని పోసాని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోడీని చంద్రబాబు అడ్డగోలుగా చేసిన దూషణలను మర్చిపోతారని తాను అనుకోవడం లేదన్నారు.

First Published:  10 Feb 2024 1:23 PM GMT
Next Story