Telugu Global
Andhra Pradesh

అక్రమ సంబంధంపై ఎన్టీఆర్‌ ప్రమాణం చేయించారు.. - పోసాని

ఈ ఘటన తర్వాతే వెంటనే కుటుంబసభ్యులను పిలిచి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్‌ ప్రకటించారన్నారు. ఆస్తులు ఆమెకు రాసిస్తారేమోన‌ని కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించారన్నారు.

అక్రమ సంబంధంపై ఎన్టీఆర్‌ ప్రమాణం చేయించారు.. - పోసాని
X

ఏ కులంవాడితోనైనా స్నేహం చేయవచ్చు గానీ.. గుణం లేని వాడితో స్నేహం చేయవద్దన్నారు నటుడు పోసాని కృష్ణమురళీ. ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి గుణం లేని వ్యక్తి ఒకే ఒక్కడు ఉన్నాడని అతడే చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అతడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. అవసరం ఉంటే ఏ దిక్కుకైనా వెళ్లండి గానీ చంద్రబాబు వద్దకు మాత్రం వెళ్లవద్దన్నారు.

ఎన్టీఆర్ వద్దకు లక్ష్మీపార్వతి రాలేదని.. ఆయనే ఈమెను పిలిపించుకున్నారన్నారు. లక్ష్మీపార్వతి బాగా చదువుకుంద‌ని, అప్పటికే బాగా ఆస్తులు కూడా ఉండేవన్నారు. ఆమె ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని గ్రహించిన చంద్రబాబునాయుడు.. ఆమెను బయటకు పంపించేందుకు అక్రమ సంబంధం అనే కుట్రకు తెరలేపారన్నారు.

స్నేహితురాలి కుమారుడితో లక్ష్మీపార్వతికి అక్రమ సంబంధం ఉందంటూ చంద్రబాబు ప్రచారం చేయించారని పోసాని గుర్తుచేశారు. ఈ విషయం ఎన్టీఆర్‌కు తెలియడంతో '' ఒకరోజు లక్ష్మీపార్వతిని, చంద్రబాబునాయుడిని, ఆ అబ్బాయిని పిలిపించి ఇంట్లోంచి తిరుమ‌ల‌ లడ్డూ తెచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ఇది తిరుమ‌ల లడ్డూ, దీని మీద ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీపార్వతితో నీకున్న సంబంధం ఏంటో చెప్పు అని ఎన్టీఆర్‌ ప్రశ్నించారు. దాంతో లక్ష్మీపార్వతి తనకు తల్లిలాంటిది సర్ అంటూ ఆ అబ్బాయి ఏడ్చేశారు'' అని పోసాని వివరించారు.

అప్పుడు ఎన్టీఆర్‌ చంద్రబాబునాయుడి ముఖాన ఉమ్ము మాత్రమే ఊయలేదు గానీ, అన్ని తిట్లు తిట్టారన్నారు. ఈ ఘటన తర్వాతే వెంటనే కుటుంబసభ్యులను పిలిచి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్‌ ప్రకటించారన్నారు. ఆస్తులు ఆమెకు రాసిస్తారేమోన‌ని కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించారన్నారు. లక్ష్మీపార్వతి ఒక్క రూపాయి కూడా అవసరం లేదనగానే అందరూ వెళ్లిపోయారన్నారు. చంద్రబాబు కారణంగానే మూడు సార్లు ఎన్టీఆర్‌కు గుండెపోటు వచ్చిందన్నారు.

మేజర్ చంద్రకాంత్‌ సినిమా కార్యక్రమం తిరుపతిలో జరిగినప్పుడే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్‌ చెప్పారని.. వెంటనే చంద్రబాబునాయుడు లైట్లు ఆఫ్ చేయించారని పోసాని వివరించారు. ఎన్టీఆర్‌ ఆత్మ శాంతించాలంటే జగన్ ప్రభుత్వాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిపించాలని పోసాని విజ్ఞప్తి చేశారు.

First Published:  28 May 2023 10:59 AM GMT
Next Story